RCB : ఆర్సీబీ జట్టును కాదు మేనేజ్‌మెంట్‌నే మార్చాలి.. స్టార్ ఆటగాడు!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, బెంగళూరు మ్యాచ్‌ తర్వాత RCB టీమ్ మేనేజ్‌మెంట్‌పై ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌ మహేష్‌ భూపతి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహేష్‌ భూపతి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఏం ట్విట్ చేశారో చదివేయండి.

New Update
RCB : ఆర్సీబీ జట్టును కాదు మేనేజ్‌మెంట్‌నే మార్చాలి.. స్టార్ ఆటగాడు!

Star Cricketer : ఐపీఎల్‌ 2024(IPL 2024) లో గత రికార్డులు అన్నీ బ్రేక్ అవుతున్నాయి. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీ రికార్డులు నమోదయ్యాయి. టోర్నీలో అత్యధిక స్కోరు సాధించిన సన్‌రైజర్స్‌ తన రికార్డును తానే అధిగమించింది. చివరి వరకు పోరాడిన ఆర్సీబీకి ఫలితం దక్కలేదు. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఓటమి తప్పలేదు. అత్యధిక పరుగులు సమర్పించుకుని, టోర్నీలో వరుస ఓటముల తీరును కొనసాగిస్తున్న ఆర్సీబీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌ మహేష్‌ భూపతి(Mahesh Bhupathi) కూడా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 17వ సీజన్‌(Indian Premier League 17 Season) నడుస్తోంది. ప్రతి సీజన్‌ మొదలయ్యే ముందు రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) టీమ్‌, ఈ సాలా కప్‌ నమ్‌దే అంటూ ప్రచారం మొదలు పెడుతుంది. బెంగళూరు అభిమానులు కూడా ఇదే స్లోగన్‌తో టీమ్‌కు సపోర్ట్‌ చేస్తుంటారు. మరో పక్క స్టార్లకు కొదవలేని ఆర్సీబీ జట్టును చూసిన ప్రతిసారీ, ఆర్సీబీ కచ్చితంగా కప్ గెలుస్తుందని విశ్లేషకులు కూడా అంచనాలు వేస్తుంటారు. ఈ జోష్‌ అంతా లీగ్‌ మొదలవ్వడానికి ముందు. ఆ తర్వాత ఆర్సీబీ కథ మారదు. ఇప్పటికి 16 సీజన్లుగా ఈ ఫ్రాంఛైజీ బెంగళూరు ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది.

ప్రస్తుత ఐపీఎల్‌ 2024లోనే అదే పరిస్థితి కొనసాగుతోంది. చాలా మంది అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ లీగ్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. పాయింట్స్‌ టేబుల్‌లో అట్టడుగున కొనసాగుతోంది. ఏప్రిల్‌ 15న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బెంగళూరు ఓడిపోవడం చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కి అత్యధిక స్కోరు రికార్డును అందించిన ఆర్సీబీ బౌలర్లపై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరుగుతోంది.

* మహేష్‌ భూపతి ట్వీట్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, బెంగళూరు మ్యాచ్‌ తర్వాత మహేష్‌ భూపతి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఓ ట్వీట్‌ చేశాడు. RCB టీమ్ మేనేజ్‌మెంట్‌పై విరుచుకుపడ్డాడు. జట్టును సరిగ్గా బిల్డ్ చేయగల కొత్త యజమానికి ఆర్సీబీని అమ్మాలని బీసీసీఐని డిమాండ్ చేశాడు. ‘స్పోర్ట్‌, ఐపీఎల్‌, ఫ్యాన్స్‌, చివరికి ప్లేయర్ల కోసం కూడా BCCI కొత్త ఓనర్‌కు ఆర్సీబీని అప్పగించాలి. ఇతర జట్లు చేసిన విధంగా స్పోర్ట్స్ ఫ్రాంచైజీని నిర్మించడానికి శ్రద్ధ వహించే కొత్త యజమానికి అవకాశం ఇవ్వాలని నేను భావిస్తున్నాను.’ అని మహేష్‌ భూపతి పేర్కొన్నారు.

Also Read : రికార్డుల మోత మోగించిన రాయల్ ఛాలెంజర్స్ vs సన్ రైజర్స్ మ్యాచ్

Advertisment
Advertisment
తాజా కథనాలు