Nostradamus : మూడవ ప్రపంచ యుద్ధంపై భయపెడుతున్న నోస్ట్రాడమస్ అంచనాలు..

New Update
Nostradamus : మూడవ ప్రపంచ యుద్ధంపై భయపెడుతున్న నోస్ట్రాడమస్ అంచనాలు..

3rd World War : ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్తును ఊహించిన వ్యక్తులుగా కొందరు వ్యక్తులు పాపులర్ అయ్యారు. వీరి గురించి ఎన్నో గ్రంథాల్లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలాంటి వారిలో ఒకరు నోస్ట్రాడమస్(Nostradamus). ఆయన 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు(French Astrologer). నోస్ట్రాడమస్ రచించిన లెస్ ప్రొఫెటీస్ (ది ప్రొఫెసీస్) అనే పుస్తకం చాలా ప్రసిద్ది చెందింది. భవిష్యత్తుకు సంబంధించిన 942 ఘటనలను ఆయన ఈ పుస్తకంలో అంచనా చేశారు. వీటిలో కొన్ని ప్రస్తుత ప్రపంచంలో సంచలనంగా మారాయి. తాజాగా మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో, మరోసారి నోస్ట్రాడమస్ భవిష్యత్తు అంచనాలు చర్చనీయాంశం అయ్యాయి.

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి, నావికా యుద్ధం గురించి నోస్ట్రాడమస్ ముందే అంచనా వేశారని, ఇది మూడో ప్రపంచ యుద్దానికి సంకేతమని సోషల్‌ మీడియా(Social Media) లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.

* నోస్ట్రాడమస్ అంచనాలు

ఇజ్రాయెల్‌పై ఇరాన్(Israel-Iran) దాడి చేసిన తర్వాత, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు ఇలానే కొనసాగితే మూడో ప్రపంచయుద్ధం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన తాజా ప్రకటన తర్వాత యుద్ధం తీవ్రతరం అవుతుందనే భయం మరింత పెరిగింది. ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ మాట్లాడుతూ, ఈ దాడి ద్వారా ఇరాన్ అన్ని పరిమితులను దాటిందని, దీనికి ప్రతిస్పందించే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని అన్నారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఎలాంటి దాడికి పాల్పడినా.. అమెరికా మద్దతు ఇవ్వబోదని వైట్‌హౌస్‌ స్పష్టం చేసింది. ఇప్పుడు మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాను హెచ్చరించారు. ఇరాన్, ఇజ్రాయెల్ విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదని చెప్పారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడిలో అమెరికా జోక్యం చేసుకుంటే లేదా ఏదైనా సహాయం అందిస్తే, తాము చూస్తూ ఊరుకోబోమని, ఇరాన్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తామని పుతిన్ తేల్చి చెప్పారు.

ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ నోస్ట్రాడమస్ అంచనాలు తెరపైకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందనే చర్చలు జరుగుతున్నాయి. మహాయుద్ధం గురించి నోస్ట్రాడమస్ అంచనా రుజువు అవుతుందా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : సూర్యుడిని చూడని గ్రామం..కానీ అక్కడ కాంతికి లోటు ఉండదు

Advertisment
తాజా కథనాలు