Gurmeet Ram Rahim: డేరా బాబాకు పెరోల్‌ ఇవ్వడంపై పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

రేప్‌ కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు పదేపదే పెరోల్‌ ఇవ్వడంపై పంజాబ్‌, హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనుంచి అతనికి పెరోల్‌ ఇవ్వాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరని హర్యానా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

New Update
Gurmeet Ram Rahim: డేరా బాబాకు పెరోల్‌ ఇవ్వడంపై పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

రేప్‌ కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు (డేరా బాబా) పంజాబ్‌, హర్యానా హైకోర్టు షాకిచ్చింది. అతనికి పదేపదే పెరోల్‌ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనుంచి హైకోర్టు పర్మషన్‌ లేకుండా.. అతనికి పెరోల్‌ ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా ఇప్పటిదాకా 91 రోజులు పెరోల్‌పై బయటకు వచ్చారు. గత నాలుగేళ్లలో 9 సార్లు ఆయనకు పెరోల్‌ మంజూరు చేశారు. అయితే ఈ ఏడాది జనవరిలో ఏకంగా 50 రోజులు పెరోల్‌పై నుంచి జైలు నుంచి బయటికి వచ్చాడు.

Also Read: ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులే: సుప్రీంకోర్టు

తాజాగా డేరా బాబా మళ్లీ తనకు పెరోల్‌ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పంజాబ్‌, హర్యానా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో రమ్‌ రహీం వలే.. ఎంతమంది దోషులకు పెరోల్‌ ఇచ్చారు? ఎన్ని రోజులు ఇచ్చారు? ఎంత మందికి పెరోల్స్‌ ఆమోదం పొందాయి అనే వివరాలు తమకు సమర్పించాలని హైకోర్టు.. హర్యానా ప్రభుతానికి ఆదేశాలు జారీ చేసింది.

హర్యానా ప్రభుత్వం పదే పదే పెరోల్‌ మంజూరు చేయడం, ఎన్నికల సమయంలో ఎక్కువగా జైలు నుంచి అతడ్ని బయటకు తీసుకురావడంపై పంజాబ్, హర్యానా హైకోర్టులో ఎస్‌జీపీసీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. తాజా పెరోల్‌ గడువు ముగిసే మార్చి 10న గుర్మీత్ లొంగిపోయేలా చర్యలు తీసుకోవాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇకనుంచి హైకోర్టు అనుమతితోనే పెరోల్‌ మంజూరు చేయాలని స్పష్టం చేసింది.

Also Read: ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్‌ లేక వృద్ధుడు మృతి.. ఎయిర్‌ ఇండియాకు భారీ జరిమానా

Advertisment
Advertisment
తాజా కథనాలు