Delhi : ఫార్చ్యునర్ కారు కట్నంగా ఇవ్వలేదని భార్యను చంపేసిన భర్త

ఏంటో మన దేశం...ముందుకు పరుగెడుతున్నామో...వెనక్కు వెళుతున్నామో తెలియడం లేదు. ఇంత అభివృద్ధి చెందుతున్నా...వరకట్నం వేధింపులు. చావులు మాత్రం ఆగడం లేదు. తాజాగా గ్రేటర్ నోయిడాలో ఫార్చ్యునర్ కారు కట్నంగా ఇవ్వలేదని ఓ భార్యని భర్త చంపేశాడు.

Delhi : ఫార్చ్యునర్ కారు కట్నంగా ఇవ్వలేదని భార్యను చంపేసిన భర్త
New Update

Dowry Murder In Greater Noida : దేశ రాజధాని ఢిల్లీ(Delhi) కి పక్కనే ఉన్న గ్రేటర్ నోయిడాలో దారుణమైన ఘటన జరిగింది. వరకట్ర వేధింపులతో తన భార్యను తానే చంపేశాడో భర్త. కట్నం కింద ఫార్చ్యునర్ కారు(Fortuner Car) ఇవ్వలేదని మహిళను భరత, అతని బంధువులు కలిసి చిత్రహింసలుకు గురి చేసి మరీ చంపేశారు. గ్రేటర్ నోయిడా(Greater Noida) లోని ఖాడా చౌగన్‌పూర్‌ అనే ప్రాంతంలో ఉంటున్న వికాస్‌కు కరిష్మితో 2022లో పెళ్లి అయింది. విమాహం సమయంలో కరిష్మా తల్లిదండ్రులు వికాస్‌కు 11 లక్షల కట్నం, ఒక ఎస్‌యూవీ ఇచ్చారు. కానీ అవి వికాస్‌కు, అతని తల్లిదండ్రులకు సరిపోలేదు. పెళ్ళి అయిన తర్వాత నుంచి అదనపు కట్నం(Additional Dowry) కోసం వేధిస్తూనే ఉన్నారు. అది చాలదు అన్నట్టు కరిష్మకు కొంతకాలం క్రితం ఆడపిల్ల పుట్టింది. దాంతో ఆమెకు మరింత వేధింపులు ఎక్కువయ్యాయి.

వికాస్ కుటుంబం తన సోదరిని మానసికంగా, భౌతికంగా చాలా హింసించారని చెబుతున్నాడు కరిష్మా సోదరుడు దీపక్. ఈ వ్యహహారాన్ని స్థానిక సంచాయితీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాం. రెండు కుటంబాలు కలిసి సమస్యలను పరిష్కరించేందుకు కూడా ప్రయత్నించామని అంటున్నాడు. కానీ వికాస్, అతని బంధువులు మాత్రం తాము పట్టిన పట్టు విడవలేదని దీపక్ చెబుతున్నారు. ముందు ఇచ్చిన కట్నం కాకుండా అదనంగా మరో 21 లక్షలు, ఫార్చ్యూనర్ కారు కోసం తన చెల్లెలిని హింసించారని అంటున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం తన చెల్లెల్ఉ ఫోన్ చేసి వికాస్, అతని తల్లిదండ్రులు తనను కొడుతు్నారని పోన్ చేసి చెప్పింది. అది విన్న వెంటనే కరిష్మా కుటుంబసభ్యులు వికాస్ ఇంటికి చేరుకున్నారు. కానీ అప్పటికే ఆమె చనిపోయి ఉంది.

కరిష్మా చావుకు వికాస్, అతని బంధువులే కారణమంటూ ఆమె కుటుంబసభ్యులు పోలీసులుకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Patanjali : క్షమాపణలు అంగీకరించం..శిక్షకు సిద్ధంగా ఉండండి..బాబా రామ్‌దేవ్‌ మీద సుప్రీంకోర్టు ఆగ్రహం

#husband #murder #fortuner-car #dowry #greater-noida
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి