Supreme Court : మైనర్ బాలుడికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు.. కొన్ని నెలల క్రితం ఉత్తరఖాండ్‌లో.. ఓ మైనర్ బాలుడు తన క్లాస్‌మెట్ అమ్మాయి(14) అసభ్యకరమైన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో తాజాగా అతడికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. By B Aravind 22 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి No Bail For Boy : కొన్ని నెలల క్రితం ఉత్తరఖాండ్ (Uttarakhand) లో.. ఓ మైనర్ బాలుడు (Minor Boy) తన క్లాస్‌మెట్ అమ్మాయి(14) అసభ్యకరమైన వీడియో తీసి సోషల్ మీడియా (Social Media) లో పోస్టు చేసిన కేసులో తాజాగా అతడికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. ఈ ఘటన జరిగిన తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో ఆ బాలిక అదృశ్యమయ్యింది. ఆ తర్వాత ఆమె మృతదేహం లభ్యమైంది. దీంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు అవమానంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు ఆ మైనర్ బాలుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. Also read: మాచర్ల ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్ చేయలేదు.. సీఈవోపై ఈసీ ప్రశ్నల వర్షం! ఆ తర్వాత బాలుడి కుటుంబ సభ్యులు బెయిల్ కోసం జువైనల్ జస్టీస్ బోర్డ్‌ను(JJB) ఆశ్రయించారు. జనవరి 10న దీనిపై విచారించిన జేజేపీ బెయిల్‌కు నిరాకరించింది. ఆ తర్వాత వాళ్లు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. హైకోర్టు కూడా ఆ మైనర్ బాలుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇక చివరికి వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. Also Read: కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపులు.. నిందితుడి అరెస్టు #telugu-news #supreme-court #minor-boy #no-bail మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి