Nitish Kumar : కూటమిలో కల్లోలం.. నితీశ్ యూటర్న్.. లెక్కలివే.

బీహార్ రాజకీయాల్లో ఎద్ద మార్పే జరగబోతోంది. దీనికి సంబంధిన సంకేతాలు చాలా బలంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నితీష్ కుమార్ వైఖరి మారిన తీరు చూస్తుంటే త్వరలోనే ప్రభుత్వం మారే అవకాశం కనిపిస్తోంది. అదే కనుక జరిగితే నితీష్ కుమార్ సీఎం అవుతారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Nitish Kumar : కూటమిలో కల్లోలం.. నితీశ్ యూటర్న్.. లెక్కలివే.
New Update

Nitish Kumar : రాజకీయాలు.. ఈ మాట ఎవరు ఎప్పుడు కనిపెట్టారో తెలియదు కానీ... దీని వెనకు ఉన్న అర్ధం అంతా ఇంతా కాదు. ఇవి ఎప్పుడు ఎలా మారుతాయో... ఎందుకుమారుతాయో... ఇందులో ఉన్నవారు ఏం చేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. ప్రపంచం అంతటా ఇవి జరుగుతూనే ఉంటాయి. భారతదేశం(India) లో అయితే మరీ ఎక్కువ. ఇక్కడ ఉండేవారు వీటిని రోజూ చూస్తూనే ఉంటారు. కానీ నిన్నటి నుంచి జరుగుతున్నదంతా ఒక ఎత్తు. బీహార్ రాజకీయాల్లో(Bihar Politics) ఒక పెద్ద తిరుగుబాటే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్(Nitish Kumar) వైఖరి చూస్తుంటే అక్కడ త్వరలోనే ప్రభుత్వం మారే అవకాశం కనిపిస్తోంది.

దేశంలో ఒక ముఖ్యమైన రాష్ట్రం బీహార్. రాజకీయంగా బలంగా ఉండే ఈ రాష్ట్రంలో ఇప్పుడు పెను ప్రకంపనలు వస్తాయేమో అనిపిస్తోంది. బీమార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజకీయాల్లో బాగా రాటుదేలినవారు. అయకున్నంతగా పరిజ్ఞానం ఎవరికీ లేదని కూడా చెబుతుంటారు. అలాంటి ఆయన ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ రాజకీయ విన్యాసానికి తేర లేపనున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. నిన్న, మొన్నటి వరకు ఇండియా కూటమితో చెట్టపట్టాలేసుకుని తిరిగి, మీటింగ్‌లకు హాజరయి...కూటమితోనే ఉంటాను అని సంకేతాలిచ్చిన నితీశ్ ఇప్పుడు రంగు మార్చబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వారం రోజులుగా ఇవి హల్ చల్ చేస్తున్నా... నిన్నటి నుంచి మరింత ఊపందుకున్నాయి. వస్తున్న వార్తల ప్రకారం నితీశ్ కుమార్ ఎన్డేయే కూటమిలోకి చేరబోతున్నారని...మరోసారి సీఎం అవడం ఖాయమని తెలుస్తోంది.

Also Read : ‘సిద్ధం’లో మోగనున్న జగన్‌ ఎన్నికల శంఖారావం.. లక్షల్లో జనసమీకరణ!

నితీశ్‌ కుమార్‌ కోసం రెండు కూటమిలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఆయనను ఒప్పించేందుకు ఆర్జేడీ-కాంగ్రెస్(RJD-Congress) చేసిన ప్రయత్నాలు ఏవీ సక్సెస్ అవ్వలేదు. కానీ ఆర్జేడీ మాత్రం లొంగిపోయే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపై నితీశ్ ఎన్డీయేలోకి రావడం దాదాపు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం పైపై లాంఛనాలు మాత్రమే చేయాల్సి ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈరోజు , రేపు పాట్నాలో ఆర్జేడీ, జేడీయూ ముఖ్యమైన సమావేశాలు నిర్వహిస్తున్నాయి. వీటి తర్వాత మొత్తం విషయం బయటకు వచ్చేయొచ్చు.

నితీశ్ కుమార్-ఎన్డీయే...

కూటములను మార్చడం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఇదేమీ కొత్త కాదు. ఇంతకు ముందు కూడా ఇలా చేశారు ఆయన. దశాబ్ద కాలం ఎన్డీయేతో ఉన్న అనుబంధాన్ని కాదనుకుని 2013లో నితీశ్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారు. అప్పుడే అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుని అదే పార్టీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు నితీశ్. అటువైపు ఎన్డీఏలోకి జేడీయూని కలుపుకోవడానికి బీజేపీ(BJP) నాయకత్వం కూడా సిద్ధంగానే ఉంది. ఎందుకంటే నితీశ్ కుమార్ ఇండియా కూటమి నుంచి విడిపోతే ఎన్డీయే, బీజేపీకి బలం చేకూరినట్టే . అయితే బీజేపీ మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తోంది. జేడీయే రావడం వలన పెద్దగా ఒరిగేదేం లేదన్నట్టు ఉంది. అందుకే నితీశ్ చేరిక, ప్రభుత్వం ఏర్పాట్ల మీదా తొందరపడడం లేదు కూడా. నితీశ్ రాకతో ఓట్లలో తేడా ఏమీ ఉండదని...బీజేపీనే సొంతంతగా ఎక్కువ ఓట్లు గెలుచుకోగలదని బీహార్ బీజేపీలోని అభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి. జేడీయూకి ఎన్ని సీట్లు ఇచ్చినా బీజేపీ కోటాలో ఎక్కడికో వెళ్ళిపోతాయని అంటున్నారు.

నితీశ్ విషయంలో ఈసారి బీజేపీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఒకవేళ ఆయన ఎన్డీయే(NDA) కూటమిలోకి వచ్చినా ఈసారి బీజేపీదే పైచేయి అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 8 నుంచి 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాతో టచ్‌లో ఉన్నారని, అంకెల గేమ్‌లో ఏదైనా అవకతవకలు జరిగితే, బ్యాకప్ ప్లాన్ సిద్ధంగా ఉండాలని అంటున్నారు. అదే సమయంలో, ప్రభుత్వ ఏర్పాటుకు ముందు, బిజెపి తన మునుపటి మిత్రపక్షాలైన చిరాగ్ పాశ్వాన్ మరియు జితన్ మాంఝీలను కూడా బరిలోకి దించాలని కోరుతోంది. ఈ విషయాలన్నింటిపై బీజేపీ తరపున అమిత్ షా, జేపీ నడ్డా సహా పార్టీ సీనియర్ నేతలు సాయంత్రం సమావేశమయ్యారు. ఇందులో నితీష్ కుమార్ సహా మిత్రపక్షాలందరికీ లోక్ సభలో ఎలాంటి వాటా ఇస్తారనే దానిపై చర్చ జరిగింది.

ఆర్జేడీ ఏం చేస్తుంది?

ఇండియా కూటమి నుంచి నితీశ్ వెళ్ళిపోతే ఆర్జేడీ ఏం చేస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. నితీశ్ వెళ్ళిపోకుండా ఉండడానికి ఆర్జేడీ ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసింది. అవి ఫెయిల్ అవడంతో ఫ్లాన్ బీ మీద కసరత్తులు ప్రారంభించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. జితన్ మాంఝీ ఇంకా జేడీయూ అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చలు చేయడానికి కూడా ప్రయత్నిస్తోంది. అయితే ఈసారి వాళ్ళు అంత తేలిగ్గా ఒప్పుకోరని...నితీశ్ పార్టీ కనుక మారితే ఎదురు దాడి చేస్తారని అంటున్నారు.

కూటమి మారితే జేడీయూ ముందున్న సవాళ్ళు...

నితీశ్ కనుక కూటమి మారితే ఈసారి జేడీయేకి అంత తేలికగా ఏమీ ఉండదు. చాలానే సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది. ఈసారి నితీశ్ పెట్టే షరతులను బీజేపీ పూర్తిగా అంగీకరించదని ఆల్రెడీ సమాచారం వచ్చేసింది. దీని ప్రకారం ఈసారి కూడా నితీశ్ ముఖ్యమంత్రి అయితే హోంశాఖ లేదా ఫైనాన్స్ బీజేపీకి వెళ్ళిపోతుంది. జేడీయూ ఏం చేయలేని పరిస్థితి. ఇందుకు కారణం బీహార్‌లో నితీశ్‌కు పాపులారిటీ కూడా తగ్గడం అని అంటున్నారు.

అసలు నితీశ్ కుమార్ ఇండియా నుంచి ఎందుకు బయటకు వచ్చేయాలనుకుంటున్నారు?

ఇండియా కూటమిని ఒక్క తాటి మీదకు తీసుకురావడంలో నితీశ్ కుమార్ చాలానే చేశారు. మొదటి సమావేశం పాట్నాలోనే జరిగింది. అయితే ఇండియా కూటమి రూపుదిద్దుకున్నప్పుడు కాంగ్రెస్ నితీశ్‌ను తొక్కేయాలని చూసిందని...ఆయనకు బాధ్యత ఇవ్వకుండా అణగదొక్కిందని చెబుతున్నారు. దాంతో పాటూ ఈ నెలలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో నితీశ్ కుమార్ పేరు కన్వీనర్‌గా ప్రకటించి, తరువాత వాయిదా వేశారు. దీని మీద కూడా ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు.

నితీశ్ వెళ్ళిపోతే ఇండియా కూటమిలో ఏం జరుగుతుంది?

ఇండియా కూటమి నుంచి నితీశ్ వెళ్ళిపోతే దానికి అది పెద్ద దెబ్బ అవుతుంది. మిగతా పార్టీలు కూడా కాంగ్రెస్ మీద వత్తిడి తీసుకువస్తాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో(West Bengal) కాంగ్రెస్ తో సీట్లు పంచుకోవడానికి మమతా బెనర్జీ సిద్ధంగా లేరు. మరోవైపు నితీశ్‌ను అడ్డంపెట్టుకుని అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఇప్పటికే అన్ని విపక్షాలతో మాట్లాడారని తెలుస్తోంది.

అసలు నితీశ్ కోసం ఎందుకు పార్టీలు కొట్టుకుంటున్నాయి?

బీహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ చాలా ముఖ్యమా అంటూ అవుననే చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఆర్జేడీ, బీజెపీ బలంగా ఉన్నాయి. కానీ నితీశ్ కుమార్ లేకపోతే వారికి ఎంత పెద్ద ఓటు బ్యాంక్ ఉన్నా పనికిరాదు. ఎందుకంటే బీహార్‌లో ఎక్కడికెళ్ళినా ఆయనదే పైచేయి. ఇది ప్రతీ ఎన్నికల్లో రుజువు అయింది కూడా. ఆర్జేడీ , బీజేపీ రెండింటిలో ఏది ప్రభుత్వాన్ని స్థాపించాలన్ని నితీశ్ సపోర్ట్ కావాల్సిందే. నితీశ్‌కు నిశ్శబ్ద ఓటు బ్యాంక్ ఉంది. ఇందులో ఎక్కువ మంది వెనకుబడిన వర్గానికి చెందిన వారు ఉంటారు. ఇవి అక్కడా చాలా బలాన్ని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఆర్జేడీ లేదా బీజేపీ నితీష్ కుమార్ ఓట్లను పూర్తిగా చీల్చుకోగలగాలి. లేదంటే మాత్రం ఆయన ఆందరికీ కావాల్సిందే.

Also Read : OU Hostel : సికింద్రాబాద్ ఓయూ పీజీ లేడీస్ హాస్టల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం

నితీశ్ కుమార్ ఎన్డీయేలోకి వెళితే మారే లెక్కలివే

బీహార్ అసెంబ్లీలో మొత్తం సీట్లు 243
మెజారిటీ సంఖ్య- 122

నితీష్ ఎన్డీఏలోకి వెళితే...
బీజేపీ- 78
జేడీయూ-45
హామ్- 4

మహాకూటమి
ఆర్జేడీ- 79
కాంగ్రెస్- 19
లెఫ్ట్- 16
AIMIM- 1
మొత్తం- 115

స్వతంత్రులు- 1

#bjp #bihar-cm-nitish-kumar #nda #india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి