Bihar Floor Test: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్.. వౌకౌట్‌ చేసిన విపక్షాలు

నేడు బిహార్‌ అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో సీఎం నితీష్‌ కుమార్-బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం గెలిచింది. మొత్తం 129 ఎమ్మెల్యేల మద్దతుతో నితిశ్‌ కుమార్‌ మరోసారి బలపరీక్షలో సమర్థవంతగా నెగ్గారు. మరోవైపు స్పీకర్‌గా ఆర్జేడీ నేత అవధ్‌ చౌదరీపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది.

New Update
Bihar Floor Test: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్.. వౌకౌట్‌ చేసిన విపక్షాలు

Bihar Floor Test: బిహార్‌ అసెంబ్లీలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. నేడు అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో సీఎం నితీష్‌ కుమార్ (Nitish Kumar) -బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం గెలిచింది. మొత్తం 129 ఎమ్మెల్యేల మద్దతుతో నితిశ్‌ కుమార్‌ మరోసారి బలపరీక్షలో సమర్థవంతగా నెగ్గారు. దీంతో విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అయితే బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. ఇందులో ఆర్జేడీ-కాంగ్రెస్ (RJD - Congress) నేతృత్వంలో మహాకూటమికి 110 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక బీజేపీ-జేడీయూ నేతృత్వంలో NDA కూటమికి 125 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది.

Also Read: జేఈఈ ఫైనల్ కీ విడుదల

అయితే అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆర్జేడీ ఎమ్మెల్యేలు చేతన్‌ ఆనంద్, నీలమ్ దేవి, ప్రహ్లద్ యాదవ్‌లు.. జేడీయూ-బీజేపీ (JDU-BJP) కూటమి వైపు కూర్చోని ఆ పార్టీ అగ్రనేత తేజస్వీ యాదవ్‌కు (Tejashwi Yadav) షాకిచ్చారు. ఇప్పటికే 125 మంది ఎమ్మెల్యేలు నితీశ్‌ కుమార్‌ వైపు ఉండగా.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మరొకరు తోడవ్వడంతో మొత్తం 129 ఓట్లతో ఆయన మరోసారి బలపరీక్షలో నెగ్గారు. NDA కూటమిలో నలుగురు ఎమ్మెల్యేలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే.. నితీశ్ సర్కార్ సభ విశ్వాసం కోల్పోతుందని.. ప్రతిపక్ష మహాకూటమి భావించింది. కానీ వీటిని తలకిందులు చేస్తూ.. ఎన్డీయే కూటమి విపక్ష పార్టీలకు షాకిచ్చింది.

2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గెలిచింది. నితీశ్ నేతృత్వంలోని జేడీయూ పార్టికి 43 స్థానాలే వచ్చినప్పటికీ.. 74 స్థానాల్లో గెలిచిన బీజేపీ నితీశ్‌ను ముఖ్యమంత్రిగా చేసింది. అయితే కొన్నాళ్ల తర్వాత బీజేపీతో విభేదించారు. ఆ తర్వాత ఆర్జేడీ (75), కాంగ్రెస్‌ (19) నేతృత్వంలో మరో మహాకూటమిలో చేరిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాచేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవల ఇండియా కూటమిలోకి వెళ్లిన నితీశ్‌ కుమార్ అక్కడి నుంచి వైదొలగిపోయారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో జతకట్టి బల పరీక్షలో మరోసారి నెగ్గారు.

Also Read: రైతుల ధర్నా…మార్చి 12 వరకు ఢిల్లీలో 144 సెక్షన్

Advertisment
తాజా కథనాలు