Nitin : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో(Politics) సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని వ్యాఖ్యానించారు. వాటిని పట్టించుకోకుండా.. అధికారంలో ఉన్న పార్టీతో కలిసి వెళ్లాలనుకుంటున్న రాజకీయ నాయకుల వైఖరి పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తీరు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. మంచి పనులు చేసిన వాళ్లకు గౌరవం దక్కడం, అవినీతిపరులకు శిక్ష పడటం కష్టంగా మారిపోయిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read : ఇకనుంచి ఇరాన్‌కు వీసా లేకుండానే వెళ్లొచ్చు.. కానీ
అలాంటి వారికే గుర్తింపు ఉంటుంది
' చర్చలు జరిగినప్పుడు భేదాభిప్రాయాలు ఉండటం ఇబ్బంది కాదు.. తగిన ఆలోచన లేకపోవడమే అసలు సమస్య. కొందరు తమ సిద్ధాంతాల పట్ల ధృఢంగా ఉంటారు. అలాంటి వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నాయకులు అప్పటికీ కూడా అధికారంలో ఉండే పార్టీలతో అనుబంధం కొనసాగించేందుకు మొగ్గు చూపుతుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఇలాంటి ప్రత్యేకత వల్లే మన పాలనా వ్యవస్థ ఆదర్శంగా నిలస్తోంది. రాజకీయాల్లోకి నాయకులు వస్తారు, వెళ్తారు. పబ్లిసిటీ, పాపులారిటీ ముఖ్యమే అయినప్పటికీ.. నేతలు తమ నియోజకవర్గాల్లో చేసిన పనే వారికి మంచి గుర్తింపును తీసుకొస్తుంది' అని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు.
వారి తీరు నన్ను ఆకట్టుకుంది
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్(Atal Bihari Vajpayee) తర్వాత.. రక్షణశాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ తీరు తనను ఆకట్టుకుందని గడ్కరీ అన్నారు. ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్ వాక్చాతుర్యాన్ని ఆయన కొనియాడారు. అలాగే ఇటీవల దేశ అత్యున్న పురస్కారం భారతరత్న గౌరవం పొందిన బిహార్ మజీ సీఎం కర్పూరీ ఠాకుర్.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. అలాగే రాబోయే రోజుల్లో మన ప్రజాస్వామ్యం ఇంకా బలోపేతం అవుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు.
Also Read : ఒకరితో ప్రేమ మరోకరితో శృంగారం.. చివరికి ఏమైందంటే!