రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యా్హ్నం పూట బయటికి వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో ఎక్కువగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తక్కువగా వరంగల్ జిల్లాలో 40.6 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలో అన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ జోన్‌లో ఉన్నాయి.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసు.. హీరోయిన్ల సీక్రెట్స్ రికార్డ్!
అయితే 2023లో ఇదే సమయానికి రాష్ట్రంలో 10 జిల్లాల్లోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. కానీ ఈసారి మాత్రం అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటాయంటే బయట భానుడి ప్రతాపం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిర్మల్ జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ 2న 41.6 డిగ్రీలు నమోదైతే.. ఈసారి 2 డిగ్రీలు పెరిగింది. జగిత్యాల జిల్లాలో గత ఏడాది కంటే ఈసారి 3.5 డిగ్రీలు అధికంగా నమోదైంది. ఇక హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.
గత ఏడాది గ్రేటర్ హైదరాబాద్‌లో 38.3 డిగ్రీలు ఉండగా.. ఈసారి చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటిపోయాయి. అలాగే బుధవారం నుంచి రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు బయటికి వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Also Read: అలా చేస్తే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు