Nipah Virus in Kerala: కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. దీని బారిన పడ్డ వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వైరస్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు.
కేరళలో నిపా వైరస్ రోగుల సంఖ్య 5కు చేరింది. నిపాను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్ మెంట్ జోన్ లను ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం కలిపించడం లేదు. రోగులతో పరిచయం ఉన్న సుమారు 700 మంది జాబితాను తయారు చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ చెబుతున్నారు. ప్రస్తుతానికి వీరందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారని అంటున్నారు. ఇందులో మళ్ళీ 77మందిని హైరిస్క్ కేటగిరీలో ఉంచామని తెలిపారు. ఇప్పటికీ నిపా వైరస్ సోకి రాష్ట్రంలో ఇద్దరు మరణించారు. హై
రిస్క్ కేటగిరిలో ఉన్నవారు తమ ఇంటిని బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు.
అన్నీ నిషేధం....
కోజికోడ్ జిల్లాలో పండుగలు, కార్యక్రమాలను నిషేధించారు. చనిపోయిన ఇద్దరు రోగులు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏఏ మార్గాల్లో వెళ్ళారో ట్రేస్ చేస్తున్నారు. ఈ జిల్లాలోని 9 పంచాయితీల్లో 58 వార్డులను కంటైన్ మెంట్ జోన్స్ గా చేశారు. అత్యవసర సేవలకు తప్ప మిగతా వేటికీ అనుమతులను ఇయ్యడం లేదు. అత్యవసర సరుకులు అమ్మే దుకాణాలకు కూడా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అలాగే కంటైన్ మెంట్ ఉన్న జోన్స్ లో బస్సులు కూడా ఆగకూడదని రిస్ట్రిక్షన్స్ విధించారు.
చిన్నారుల సైతం వైరస్ బారిన...
నిపా వైరస్ చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టడంలేదు. కోజికోడ్ జిల్లాలో 9 ఏళ్ళ చిన్నారికి నిపా వైరస్ సోకింది. ప్రస్తుతం పాప వెంటిలేటర్ సపోర్ట్ తో ఉంది. తన చికిత్స్ కోసం ప్రభుత్వం ఐసీఎమ్మార్ నుంచి మోనోక్లోనల్ యాంటీ బాడీస్ ను అందించాలని ఆదేశించింది. ప్రస్తుతం కేరళలో ఉన్న నిపా వైరస్ బంగ్లాదేశ్ నుంచి వ్యాపించిందని చెబుతున్నారు. ఇది తొందరగా వ్యాప్తి చెందకపోయినప్పటికీ మరణాల రేటు మాత్రం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. మొదటిసారి కేరళలో ఈ వైరస్ 2018లో వచ్చింది. అప్పుడు 18 మంది రోగులకు రాగా అందులో 17 మంది చనిపోయారు.
Also Read: దేశంకోసం ప్రాణాలు వదిలిన ఈ డీఎస్పీ కథ వింటే ఖచ్చితంగా సెల్యూట్ చేస్తారు..!