Stock Market : ఒడిదుడుకుల్లో సెన్సెక్స్...నష్టాలతో ప్రారంభమైన సూచీలు నిన్న సాయంత్రం ఫ్లాట్‌గా ముగిసిన దేశీ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 178 పాయింట్ల నష్టంతో 71,207 వద్ద ఉండగా... నిఫ్టీ 78 పాయింట్లు కోల్పోయి 21,466 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 10 Jan 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Sensex : గత కొన్ని రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) చాలా ఒడిదుడుకులు లోనవుతోంది. కొంతసేపు బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నా తరువాత డౌన్ ట్రెండ్‌లోకి వెళ్ళిపోతున్నాయి. ఒక్క రోజు లాభాల బాట పడితే చాలు దాని తరువాత వరుసగా నష్టాలను చవి చూస్తున్నాయి. దీంతో మార్కెట్లో బాగా అనిశ్చితి ఏర్పడింది. ఈరోజు ఉదయం కూడా ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్(Sensex)...కాసేపటికే నష్టాల్లోకి వెళ్ళిపోయింది. దయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 178 పాయింట్ల నష్టంతో 71,207 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ(Nifty) 78 పాయింట్లు కుంగి 21,466 దగ్గర ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.14 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ తన జీవితకాల గరిష్ఠ స్థాయి 71,913 నుంచి 1,400 పాయింట్లకు పైగా క్షీణించి 1.3% క్షీణతతో 70,506 వద్ద ముగిసింది. Also read:ప్లీజ్ నన్ను కాల్చొద్దు… లైవ్‌లో దుండగులను అభ్యర్ధించిన న్యూస్ ప్రెజెంటర్ అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూలతలు.. గ్లోబల్ మార్కెట్ల(Global Market) లో బలహీనతకు అనుగుణంగా.. ఇండియన్ ఈక్విటీ బెంచ్‌మార్క్(Equity Benchmark) సూచీలు సెన్సెక్స్ & నిఫ్టీలు ఈరోజు నష్టాల్లోకి జారుకున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిన్న అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మరోవైపు ఐరోపా సూచీలు కూడా అదే బాటను పట్టాయి. యూఎస్ మార్కెట్లలో... డౌ జోన్స్, S&P 500 వరుసగా 0.42 శాతం & 0.15 శాతం పడిపోయాయి. ఇక ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగానే ఉన్నాయి. జపాన్ నికాయ్ మాత్రం 1.7 శాతం పెరిగింది. స్టాక్స్ జాగ్రత్తగా ఎంచుకోవాలి... సెన్సెక్స్-30లో హెచ్‌సీఎల్ టెక్, టైటన్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్, టీసీఎస్, ఎంఅండ్‌ఎం, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా... ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లోకి పడిపోయాయి. గత ఒన్ని రోజులుగా మార్కెట్లో కంజ్యూమరిజం, పెట్టుబడుల్లో పెరుగుదల ఆగిపోయింది. దీనివల్లనే మార్కెట్లలో అస్థిత కొనసాగుతోంది. ఇది మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే డివిడెండ్లు సక్రమంగా చెల్లించే కంపెనీలు, స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల నష్టాల్లో కూరుకుపోకుండా ఉంటారని అంటున్నారు. #india #stock-markets #nifty #down-trend #sexsex మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి