NIA: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. కర్నూలు, కరీంనగర్‌లో రైడ్స్‌

కరీంనగర్‌లో మళ్లీ NIA సోదాల కలకలం రేపుతున్నాయి. హుస్సేన్‌పురాకు చెందిన తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో సోదాలు చేశారు అధికారులు. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా(PFI)తో సంబంధాలున్నాయన్న అనుమానంతో తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మస్కట్‌లో ఉంటున్నారు తఫ్రీజ్ ఖాన్. 6నెలల వ్యవధిలో మూడుసార్లు NIA దాడులు జరిగగా.. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుంది NIA. నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, కోరుట్ల.. తదితర ప్రాంతాల యువతకు PFI శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం.

New Update
National : దేశంలో 17చోట్ల ఎన్‌ఐఏ సోదాలు

NIA RAIDS in Telangana, ANDHRA: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని కరీంనగర్‌తో పాటు ఏపీలోని కర్నూలులోనూ ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది. కర్నూలు ఓల్డ్ సిటీకి చెందిన అబ్దుల్లా, మావియా ఇళ్లలో సోదాలు చేస్తోంది. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. అటు కరీంనగర్‌లో మళ్లీ NIA సోదాల కలకలం రేపుతున్నాయి. హుస్సేన్‌పురాకు చెందిన తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో సోదాలు చేశారు అధికారులు. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా(PFI)తో సంబంధాలున్నాయన్న అనుమానంతో తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మస్కట్‌లో ఉంటున్నారు తఫ్రీజ్ ఖాన్. 6నెలల వ్యవధిలో మూడుసార్లు NIA దాడులు జరిగగా.. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుంది NIA. నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, కోరుట్ల.. తదితర ప్రాంతాల యువతకు PFI శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం.

గతంలోనూ ఇదే తరహా దాడులు:

సున్నితమైన అంశాలను తీసుకొని యువతను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించడమే వారి ప్రధానమైన అజెండా. కరీంనగర్‌లోని హుస్సేన్ పురాకు చెందిన తబ్రేజ్‌ 6 నెలల క్రితమే విదేశాలకు వెళ్లాడు..అతనికి PFIతో సంబంధాలున్నాయన్న అనుమానంతో తనిఖీలు చేస్తున్నారు NIA అధికారులు. నిజానికి గతంలో కూడా పీఎఫ్‌ఐ లింకులపై ఎన్‌ఐఏ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కుపాదం మోపింది. గతేడాది సెప్టెంబర్‌లో ఎన్‌ఐఏ భారీ ఎత్తున రైడ్స్‌గా చేసింది. నిజామాబాద్, నిర్మల్‌, జగిత్యాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో దాడులు చేపట్టింది. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కేసులో నిందితులు, అనుమాతుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 చోట్ల, నిర్మాల్‌ జిల్లా భైంసాలోని మదీనా కాలనీలో, జగిత్యాలలోని టవర్‌ సర్కిల్‌లో ఉన్న కేర్‌ మెడికల్‌లో సోదాలు చేసింది. పాపులర్‌ ఫ్రంట్‌ కార్యకలాపాలపై ఆరాతీసింది. అదే సమయంలో కర్నూలు, కడప జిల్లాల్లో 23 బృందాలు సోదాలు నిర్వహించింది. గతంలో జరిగిన సోదాల సమయంలో డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్స్‌ రూ. 8.3లక్షల నగదు స్వాధీనం చేసుకుంది ఎన్‌ఐఏ. ఇక మళ్లీ మరోసారి తెలంగాణలో ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది. ముఖ్యంగా కరీంనగర్‌లో పీఎఫ్‌ఐ కదలికలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఎన్‌ఐఏ కరీంనగర్‌కు చెందిన తఫ్రీజ్‌ ఖాన్‌ ఇంట్లో రైడ్స్‌ చేస్తోంది.

ఎన్నో నేరాలు.. ఘోరాలు:

గతేడాది సెప్టెంబర్‌ 28న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండాయాను కేంద్రం నిషేధించింది. పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు చట్టవిరుద్ధమైన సంస్థలు అని కేంద్రం ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద పీఎఫ్ఐపై అయిదేళ్ల పాటు నిషేధం విధించింది. హత్యలు, దేశ రాజ్యాంగాన్ని విస్మరించడం, ప్రజా శాంతికి భంగం కలిగించడం లాంటి తీవ్రమైన నేరాలలో పీఎఫ్‌ఐ ఉన్నట్టు కేంద్రం చెప్పింది. దేశ సమగ్రత, భద్రత, సార్వభౌమత్వానికి విఘాతం కలిగిందని తెలిపింది. ఇక PFI కార్యకర్తలు పదేపదే హింసాత్మక, విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నట్లు వివిధ కేసులు స్పష్టం చేస్తున్నాయి. ఓ కళాశాల ప్రొఫెసర్ అవయవాలను నరికివేయడం, ఇతర మతాలకు చెందిన సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను హత్య చేయడం, ప్రముఖ వ్యక్తులను, ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడం లాంటి ఎన్నో నేరాల్లో పీఎఫ్‌ఐ భాగస్వామ్యం ఉండగా.. తెలంగాణలో పీఎఫ్‌ఐ కదలికలు ఎక్కువగా ఉన్నట్టు కూడా తేలింది.

Also Read: మోదీ ప్రసంగానికి ముందే కీలక పరిణామం..కుకీ నేతలతో అమిత్‌షా భేటీ..!!

Advertisment
తాజా కథనాలు