China: చైనాలో మరో కొత్త రకం వైరస్.. మెదడుపై ఎఫెక్ట్‌

చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది. జంతువుల్లో రక్తం పీల్చే పురుగుల నుంచి మనుషులకు సోకే వైట్‌ల్యాండ్‌ అనే వైరస్‌ (WELV) ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్‌ మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని పేర్కొన్నారు.

New Update
China: చైనాలో మరో కొత్త రకం వైరస్.. మెదడుపై ఎఫెక్ట్‌

చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది. జంతువుల్లో రక్తం పీల్చే పురుగుల నుంచి మనుషులకు సోకే వైట్‌ల్యాండ్‌ అనే వైరస్‌ (WELV) ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్‌ మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని పేర్కొన్నారు. చైనాలోని జిన్‌జువో అనే నగరంలో 2019లోనే 61 ఏళ్ల వృద్ధిడిలో ఈ వైరస్‌ను గుర్తించారు. మంగోలియాలో చిత్తడి నేలకు చెందిన ఇతడికి పరాన్నజీవి కుట్టడం వల్ల అనారోగ్యం బారిన పడ్డాడు. ఐదు రోజుల పాటు జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు అతడిలో కనిపించాయి. దీంతో పరిశోధకులు సమీప ప్రాంతాల్లోని దాదాపు 14,600 జీవులను సేకరించి వాటిపై అధ్యయనం జరిపారు.

Also Read: ఇండియాలో మంకీపాక్స్ కలకలం.. ఆస్పత్రిలో అనుమానితుడు

అయితే రెండుశాతం పరాన్నజీవుల్లో WLV జన్యు పదార్థం ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఆ ప్రాంతంలో 640 మంది అటవీ అధికారుల రక్త నమూనాలను సేకరించి విశ్లేషణ జరపగా 12 మందిలో ఈ రకమైన వైరస్‌ ఉన్నట్లు బయటపడింది. వివిధ రకాల పురుగుల కాటుకు గురై సుమారు 20 మంది బాధితులకు పాజిటివ్ రావడంతో వైరస్‌ను నిర్ధరించినట్లు పరిశోధకులు తెలిపారు. చికిత్స చేసిన తర్వాత రోగులు కోలుకున్నప్పటికీ కూడా ఈ వైరస్‌ వల్ల నాడీకణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. దీనివల్ల ఇది ప్రమాదకర ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుందని ఎలుకల్లో జరిగిన ప్రయోగాల్లో గుర్తించినట్లు తెలిపారు.

అయితే ఈ వెట్‌ల్యాండ్‌ వైరస్‌ కూడా మానవుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ గ్రూప్‌నకు చెందింది. కొన్ని రకాల పరాన్న జీవుల్లో ఇది వ్యాపిస్తుంది. ఇప్పటికే గుర్రాలు, పందులు, గొర్రెల్లో ఈ వైరస్‌ RNAను గుర్తించారు. జంతువుల్లోని రక్తనాళాల్లో నిర్మాణాత్మక మార్పులు జరగడంతో ఈ ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతున్నట్లు పరిశోధకులు తేల్చి చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు