Telangana: విద్యార్థులకు అలర్ట్‌.. పాఠశాలల సమయాల్లో మార్పులు

తెలంగాణలో జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలల పనివేళలు మారాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఉదయం 9.00 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం దీనికి ఆమోదం తెలిపారు.

Telangana: విద్యార్థులకు అలర్ట్‌.. పాఠశాలల సమయాల్లో మార్పులు
New Update

Telangana School Timings: తెలంగాణలో జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలల పనివేళలు మారాయి. 2022-23 విద్యా సంవత్సరం వరకు ఈ బడులు ఉదయం 9.00 AM గంటలకే తెరుచుకునేవి. ఆ తర్వాత 2023-24 విద్యా సంవత్సరంలో ఉదయం 9.30 AM గంటలకు ప్రారంభమయ్యేవి. అయితే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మాత్రం ఉదయం 8.00 గంటలకే బస్సులెక్కి వెళ్లిపోయేవారు.

Also read: ఎమ్మెల్సీ ఎన్నికలో ఎడమ చేయి మధ్య వేలుకు సిరా గుర్తు.. ఎందుకంటే

దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఉదయం 9.30 గంటలకు వెళ్లడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడుతోందని విద్యాశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో వారు ఈ విషయాన్ని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు (Burra Venkatesham) వివరించారు. ఈ క్రమంలోనే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచి ఉదయం 9.00 గంటలకే ప్రారంభించాలన్న ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు.

అయితే ఉన్నత పాఠశాలలు మాత్రం ఉదయం 9.30 గంటలకే ప్రారంభమవుతాయి. వాటి టైమింగ్స్‌ను కూడా ఉదయం 9 గంటలకే మార్చాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత పాఠశాలలను ఉదయం 9.30లకు ప్రారంభమైతే సాయంత్రం 4.45 గంటలకు మూసివేస్తారు. వర్షాకాలం, చలి కాలంలో వాళ్లు ఇళ్లకు వెళ్లేసరికి ఆలస్యమవుతుంది. అలాగే బాలికలకు కూడా రక్షణ లేకుండా పోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నత పాఠశాలల స్కూల్ టైమింగ్స్ మార్చాలని అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Also read: డ్రగ్స్ కేసుల్లో ఎవరినీ వదలొద్దు.. సీఎం రేవంత్!

#telugu-news #telangana #schools
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe