Maharashtra: డిగ్రీ పూర్తయితే నెలకు పదివేలు..మహారాష్ట్రలో కొత్త స్కీమ్

మరికొన్ని రోజుల్లో మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్‌లు వేస్తోంది. ఈ క్రమంలో డిగ్రీ పాసయితే చాలు పదివేలు ఇస్తామంటూ నిరుద్యోగులకు ఆఫర్ ప్రకటించింది.

New Update
Maharashtra: డిగ్రీ పూర్తయితే నెలకు పదివేలు..మహారాష్ట్రలో కొత్త స్కీమ్

Eknath Shinde Government: మహారాష్ట్రలో ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్నారు. అన్ని పార్టీలు ప్లాన్‌ల మీద ప్లాన్‌లో వేస్తున్నారు. దీనికి ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రెడీ అయింది. నిరుద్యోగ యువత కోసం ఓ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి యువజన పని శిక్షణ పథకం పేరుతో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. దాని ప్రకారం నిరుద్యోగ యువతకు వారి విద్యార్హతలను బట్టి నెల నెలా బ్యాంకు అకౌంట్లలో స్టయిఫండ్‌ను జమ చేయనున్నారు. దీని కోసం రూ.5,500 కోట్లు కేటాయించింది. అక్టోబర్‌లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.దీని కోసమే ఏక్‌నాథ్‌ షిండే సర్కారు ఈ స్కీమ్‌ను ప్రకటించింది.

ఇంతకు ముందే మహారాష్ట్రలో ఏక్‌నాథ్ ప్రభుత్వం స్త్రీల కోసం లాడ్లీ బెహన్ పథకాన్ని ప్రారంభించింది. అందుకే ఇప్పుడు నిరుద్యోగ యువత కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టామని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు. రీసెంట్‌గా ముంబయ్‌ ఎయిర్‌ పోర్ట్‌ ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగుల మధ్య తోపులాట జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.

మహారాష్ట్రలో అక్టోబర్-నంబర్ మధ్య ఎన్నికలు జరగనున్నాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఉద్ధవ్‌ నేతృత్వంలోని శివసేన, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్‌ కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ ఒక కూటమిగా బరిలోకి దిగనున్నాయి.

Advertisment
తాజా కథనాలు