Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు.. రేసులో ఉంది వీళ్లే

మరికొద్దిరోజుల్లో రేవంత్‌రెడ్డి పీసీసీ పదవీకాలం ముగియనుంది. ఈ పదవి కోసం అగ్రనేతలు లాబీయింగ్ చేస్తు్న్నట్లు తెలుస్తోంది. మాదిగ కోటాలో సంపత్‌కుమార్‌, బీసీ కోటాలో మహేశ్‌కుమార్‌గౌడ్, అలాగే పొన్నం, మధుయాష్కీ, సురేష్‌ షెట్కార్‌, సీతక్క, బలరాం నాయక్ రేసులో ఉన్నారు.

New Update
Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు.. రేసులో ఉంది వీళ్లే

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. మరికొద్దిరోజుల్లో రేవంత్‌రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలతో రేవంత్ మంతనాలు జరుపుతున్నారు. అయితే పీసీసీ పదవి కోసం అగ్రనేతలు లాబీయింగ్ చేస్తు్న్నట్లు తెలుస్తోంది. పీసీసీ పదవి కోసం ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. మాదిగ కోటాలో సంపత్‌కుమార్‌, బీసీ కోటాలో మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే పొన్నం, మధుయాష్కీ, సురేష్‌ షెట్కార్‌, సీతక్క, బలరాంనాయక్‌ పేర్లు కూడా రేసులో వినిపించాయి. సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. పీసీసీ చీఫ్‌పై నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం.

Also Read: కేంద్ర కేబినెట్‌లో టీడీపీ బెర్త్‌లు ఖరారు..!

Advertisment
తాజా కథనాలు