Telangana: కొత్త పీసీసీ చీఫ్‌కు త్వరలో అనేక సవాళ్లు.. బ్యాలెన్స్‌ చేయగలరా ?

కొత్త పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న మహేష్‌ కుమార్‌ గౌడ్‌కు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు సవాలు విసరనున్నాయి. పార్టీలోని నేతలు, కార్యకర్తలను ఆయన ఎలా సమన్వయం చేస్తారనేది ఆసక్తిగా మారింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Telangana: కొత్త పీసీసీ చీఫ్‌కు త్వరలో అనేక సవాళ్లు.. బ్యాలెన్స్‌ చేయగలరా ?
New Update

కాంగ్రెస్‌ సీనియర్ నేత మహేష్‌ కుమార్‌ గౌడ్‌కు పార్టీ హైకమాండ్‌ కొత్త పీసీసీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనకు పార్టీలో సవాళ్లు ఎదురుకానున్నాయి. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో పార్టీ నాయకులు, కేడర్ల మధ్య పటిష్టంగా సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు పీసీసీ చీఫ్‌ యాక్టివ్‌గా కో ఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. పార్టీకీ, ప్రభుత్వానికి మధ్య మెరుగైన సంబంధాలు నిర్మించడం, అలాగే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వా్మ్యం చేయించాల్సి బాధ్యత పీసీసీ చీఫ్‌కే ఉంటుంది.

ఏ చిన్న సమస్యలు వచ్చినా, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా పార్టీలో సమస్యలు ఉత్పన్నమయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం సీనియర్ నేతలు మంత్రులుగా ఉన్నారు. వాళ్లకు కూడా పార్టీలో ప్రాధాన్యత కేటాయించాలి. పార్టీలో మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ కమిటీలు పనిచేస్తున్నాయి. ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్స్‌తో పాటు విద్యార్థి విభాగాలు కూడా ఉన్నాయి. మొత్తంగా పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత పీసీసీ అధ్యక్షుడిపై ఉంటుది.

Also Read: గంజాయి సాగుకు ఓకే.. సంచలన చట్టం చేసిన సర్కార్‌

గతంలో పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పనిచేసిన సంగతి తెలిసిందే. ఆయన తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారని.. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారనే టాక్ ఉంది. కాబట్టి ఇప్పుడు పార్టీ స్థాయి దిగజారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మహేష్‌ కుమార్‌ గౌడ్‌పై ఉందని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. గతంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అనుభవం తనకు కలిసొస్తుందని మహేష్‌ కుమార్ గౌడ్ చెబుతున్నారు. అలాగే తన పీసీసీ బాధ్యతను కూడా విజయవంతంగా నిర్వహిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.

అతి పెద్ద సవాల్
కొత్త పీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్‌ గౌడ్‌ మరికొన్ని రోజుల్లో పెద్ద ఛాలెంజ్ ఎదురుకానుంది. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో స్థానిక సంస్థల్లో అత్యధికంగా అధికార పార్టీ సభ్యులు గెలపించేందుకు కొత్త పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు పార్టీలో టికెట్ల కేటాయింపుల్లో కూడా అసంతృప్తి లేకుండా చూడాల్సి ఉంటుంది. అయితే మంత్రులతో పాటు పార్టీలోని సీనియర్ నాయకులు తమ అనుచరులనే స్థానిక సంస్థల్లో దించేందుకు పార్టీపై ఒత్తిడి తీసుకొస్తుంటారు. ఇలాంటి సమయంలో పీసీసీ, ప్రభుత్వంలోని కీలక నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిన అవసరం ఉంది. విపక్ష నాయకులు ఛాన్స్ ఇవ్వకుండా పార్టీ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం జరగకుండా ఎల్లప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే పార్టీ నామినేటెడ్ పదవులు, మంత్రి వర్గ విస్తరణ, పార్టీ కమిటీలు వంటి వాటిలో కూడా పీసీసీ అధ్యక్షుడు తన అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది. అలాగే నేతలు అసంతృప్తికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.

ఇదిలాఉండగా.. మరోవైపు బీజేపీ కూడా రాష్ట్రంలో ఓటు శాతాన్ని క్రమంగా పెంచుకుంటోంది. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సమానంగా 8 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. అయినప్పటికీ కూడా ఈ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో బలం ఉంది. మరోవైపు ఇటీవల ఎమ్మెల్సీ కవిత కూడా బెయిల్‌పై జైలు నుంచి విడుదల కావడంతో ఇటీవల ఆ పార్టీలో జోష్ వచ్చింది. దీంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పట్టును నిలుపుకునేందుకు బీఆర్‌ఎస్‌ కూడా వ్యూహాలు రచిస్తోంది. గతంలో ఏకంగా 33 జెడ్పీ ఛైర్మన్‌ స్థానాలు గెలుచుకున్న చరిత్ర బీఆర్ఎస్‌కు ఉంది. కాబట్టి ఈ పార్టీ కూడా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.

Also read: శృంగార ఫొటోలు పంపి.. ఉచ్చులోకి లాగి: రేణుకాస్వామి హత్యలో సంచలన నిజాలు!

మొత్తానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌, బీజేపీ.. ఈ మూడు పార్టీల మధ్య గట్టిగానే పోటీ ఉండనుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుందనేదే ఇక్కడ ప్రధాన సమస్య. అందుకోసమే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మెజార్టీ స్థానాల్లో గెలిపించేలా ప్రణాళికలు రచించి.. పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పీసీసీ చీఫ్‌కు ఉంటుంది. ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దెబ్బపడితే పదవుల్లో ఉన్న నేతలతో పాటు పీసీసీ చీఫ్‌ కూడా నిందలు ఎదురుకోవాల్సి ఉంటుంది. మరీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తన బాధ్యతను ఎలా నిర్వర్తిస్తాడనేది చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

#telangana #telugu-news #panchayat-election #congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి