USA: తండ్రే కొడుకును చంపిన వైనం..ఆరేళ్ళ పిల్లాడితో జిమ్ చేయించిన తండ్రికి శిక్ష

కన్నతండ్రే కొడుకు చావుకు కారణం అయ్యాడు. శక్తికి మించిన ఎక్సర్సైజ్ చేయించండంతో అభం శుభం తెలియని ఆరేళ్ళ పిల్లాడు గుండె ఆగి చనిపోయాడు. ఇదంతా తండ్రే దగ్గరుండి చేయించడం శోచనీయం. ఈ కేసుకు సంబంధించిన విచారణ తాజాగా న్యూ జెర్సీ కోర్టు జరిగింది.

USA: తండ్రే కొడుకును చంపిన వైనం..ఆరేళ్ళ పిల్లాడితో జిమ్ చేయించిన తండ్రికి శిక్ష
New Update

తల్లిదండ్రులు...తమ పిల్లలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. పరుగెడితే కింద పడిపోతారేమో..దెబ్బ తగిలితే ఏడుస్తారు అంటూ విలవిలలాడిపోతారు. కానీ ఇక్కడ ఓ తండ్రి మాత్రం కన్న కొడుకు పట్ల కసాయిగా ప్రవర్తించాడు. ఆరేళ్ళ పిల్లాడిని కూడా చూడకుండా అతనిపట్ల అన్యాయంగా ప్రవర్తించాడు. దీనివల్ల చివరకు పిల్లాడి ప్రాణాలే గాల్లో కలిసిపోయాయి. ఈ కేసుకు సంబంధించిన విచారణ తాజాగా అమెరికాలోని న్యూ జెర్సీ కోర్టులో జరిగింది. తండ్రి ఏం చేశాడో, పిల్లాడు ఎలా చనిపోయాడో...దానికి సంబంధించిన వీడియోను కోర్టులో ప్లే చేశారు.

అమెరికాలో 2021లో జరిగిందీ సంఘటన. న్యూ జెర్సీలోని అట్లాంటిక్ హైట్స్ క్లబ్ హౌస్ ఫిట్‌నెస్‌ సెంటర్‌లో తండ్రే పిల్లాడి ప్రాణాలు పోయేలా చేశాడు. క్రిష్టోఫర్ గ్రెగర్...ఇతనికి ఆరేళ్ళ కొడుకు ఉన్నాడు. పిల్లాడు కొంచెం లావుగా ఉన్నాడు. దాన్ని తగ్గించాలని అనుకున్నాడు గ్రెగర్. దాని కోసం జిమ్‌కు తీసుకెళ్ళి థ్రెడ్ మిల్ మీద పరుగెట్టించాడు. పిఇల్లాడు పరుగెత్తలేక పడిపోతున్నా..ఆగిపోతున్నా పట్టు వదల్లేదు. తానే స్వయంగా లేపి మరీ పరుగెట్టించాడు. అది కూడా వయసుకు మించిన వేగంతో థ్రెడ్ మిల్ చేయించాడు గ్రెగర్. దీంతో ఆ పసి గుండె తీవ్రంగా అలిసిపోయింది. గుండెపోటుకు గురైంది. దాంతోపాటూ కాలేయం కూడా దెబ్బ తింది. ఇవేవీ గ్రెగర్ గుర్తించలేదు. చివరకు పిల్లాడు అక్కడే జిమ్‌లోనే పరుగెడుతూ మరణించాడు.

నాలుగేళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటన అక్కడి అందరి హృదయాలను కలిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో న్యూజెర్సీలోని సుపీరియల్ కోర్టులో ప్లే చేశారు. దీన్న ఇచూసి కోర్టులో జడ్జిలు సైతం కన్నీరు పెట్టుకున్నారు. ఇక పిల్లాడి తల్లి ఆవేదన అయితే చెప్పనలవి కాదు. ఈ వీడియో ద్వారా విపరీతమైన ఒత్తిడి కారణంగానే చిన్నారి చనిపోయినట్లుగా తేలింది. ఈ కేసులో పిల్లాడి మరణానికి కారణమైన తండ్రికి భారీగా శిక్ష పడే అవకాశం ఉంది.

Also Read:Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లాలో భారీ నగదు సీజ్

#heart-attack #father #gym #son #new-jersy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe