HIV: హెచ్‌ఐవీ నివారణకు మందు .. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్

ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్‌ఐవీని కట్టడి చేసేందుకు అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ అనే సంస్థ.. లెనాకాపవిర్ అనే ఇంజక్షన్‌ను అభివృద్ధి చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్ అయిన ఈ ఇంజెక్షన్ త్వరలో మార్కెట్‌లోకి రానుంది.

New Update
HIV: హెచ్‌ఐవీ నివారణకు మందు .. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్

HIV Vaccine: ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌లలో హెచ్‌ఐవీ (హ్యూమన్‌ ఇమ్యూనో డిఫీషియన్సీ వైరస్‌) ఒకటి. ఏటా లక్షలాది మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. హెచ్‌ఐవీని పూర్తిగా అంతం చేసే మందు ఇంకా లేదు. అయితే దీని నుంచి రక్షణ ఇచ్చే ఇంజెక్షన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రతి ఏడాది రెండుసార్లు లెనాకాపవిర్ అనే ఇంజక్షన్ ఇచ్చి ఈ వైరస్‌ను కట్టడి చేయవచ్చు. హెచ్‌ఐవీని నిరోధించేందుకు ప్రస్తుతం రెండు రకాల మాత్రలు మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

2012లో మొదటిసారిగా ట్రువాడా అనే మాత్రకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) నుంచి పర్మిషన్ పొందాక మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత 2016లో డెస్కోవీ అనే మాత్ర అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రెండు మాత్రలతో పోలిస్తే.. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ లెనాకాపవిర్ అనే ఇంజక్షన్ నూటికి నూరుశాతం విజయవంతం కావడం విశేషం. ఈ ఇంజెక్షన్ అనేది హైచ్‌ఐవీ క్యాపిడ్స్ అంటే వైరస్ చుట్టూ ఉండే ప్రోటీన్లతో కూడిన రక్షణ పొరను ధ్వంసం చేస్తుంది. తద్వార హెచ్‌ఐవీ వైరస్ తన సంఖ్యను పెంచుకోకుండా నియంత్రిస్తుంది.

Also read: అలా చేశారంటే వదిలిపెట్టేదే లేదు.. కిమ్‌ సోదరి హెచ్చరిక!

ఆఫ్రికా దేశాల్లో చాలామంది మహిళలు అత్యాచారానికి ఎయిడ్స్ బారిన పడుతున్న నేపథ్యంలో వాళ్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. సౌతాఫిక్రాలోని (South Africa) 25 ప్రాంతాల్లో, ఉగాండాలో 3 ప్రాంతాల్లో ఈ ఇంజెక్షన్‌తో క్లినికల్ ట్రయల్స్ చేశారు. ఇందుకోసం 5 వేల మంది మహిళలను ఎంచుకుని వాళ్లని మూడు కేటగిరీలుగా డివైడ్ చేశారు. మొదటి కేటగిరిలో 2134 మంది మహిళలకు లెనాకాపవిర్ ఇంజెక్షన్ (Lenacapavir Injection) ఇచ్చారు. రెండో కేటగిరీలో 1068 మందికి ట్రువాడా, 2136 మందికి డెస్కోవీ మాత్రలు ఇచ్చారు. వీళ్లలో ట్రువాడా మాత్ర తీసుకున్నవారిలో 16 మందికి, డెస్కోవీ మాత్ర తీసుకున్న 39 మందికి ట్రయల్ సమయంలో హెచ్‌ఐవీ సోకింది. లెనాకాపవిర్ ఇంజెక్షన్ తీసుకున్న 2134 మందిలో ఒక్కరికి కూడా హెచ్‌ఐవీ సోకలేదు. అంటే 100 శాతం ఈ ఇంజెక్షన్ విజయవంతమైంది.

ఎయిడ్స్‌కు (AIDS) కారణమయ్యే హెచ్‌ఐవీ (హ్యూమన్‌ ఇమ్యూనో డిఫీషియన్సీ వైరస్‌) నుంచి పూర్తిస్థాయిలో ఈ ఇంజెక్షన్ రక్షణ కల్పిస్తుందని తేలింది. మరోవిషయం ఏంటంటే ట్రువాడా, డెస్కోవీ అనే మాత్రలను తయారుచేసిన అమెరికన్ ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ సంస్థే.. ఈ లెనాకాపవిర్ ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసింది. తమ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి అన్ని వివరాలను సౌతాఫ్రికా, ఉగాండా దేశాల్లో ఔషధ నియంత్రణ సంస్థలకు, అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించనున్నట్లు గిలియడ్ సైన్సెస్ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కొత్త ఔషధాన్ని ఆమోదిస్తుందని తాము ఆశిస్తున్నామని గిలియడ్ సైన్సెస్ తెలిపింది.

Also Read: నర్సింగ్‌ హోమ్‌ లో భారీ అగ్ని ప్రమాదం..ఊపిరాడక 10 మంది మృతి!

ఈ ఇంజెక్షన్‌ను ప్రపంచ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చే ముందు మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందని ఆ సంస్థ పేర్కొంది. అంతేకాదు గిలియడ్‌ సైన్సెస్‌ సంస్థ.. ఈ ఔషధం అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరకు అందించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జనరిక్ డ్రగ్స్ తయారుచేసే మిగతా కంపెనీలకు కూడా ఈ ఔషధానికి సంబంధించిన లైసెన్స్‌లు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో మిగతా ఫార్మా కంపెనీలు కూడా ఈ ఔషధాన్ని తయారుచేస్తాయి. ఈ ఇంజెక్షన్ ఎక్కువగా అందుబాటులోకి రావడం వల్ల దీని ధర తగ్గుతుంది. అలాగే ప్రభుత్వాలు సైతం ఈ ఔషధాన్ని కొనుగోలు చేసి.. హెచ్‌ఐవీ నుంచి రక్షణ పొందాలనుకునే ప్రతిఒక్కరికీ ఇవ్వాలని కోరింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు