CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రేపు మొట్టమొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అలాగే మంత్రి పదవుల కేటాయింపులు, మిగతావారి ప్రమాణ స్వీకారం రేపు అసెంబ్లీ జరగనున్నాయి. నిన్న రేవంత్ తో పాటూ 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు కానీ వారికి ఎవరికీ ఇంకా పదవులు అయితే కేటాయించలేదు. ఇప్పుడు దీని విషయమై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. మరికాసేపట్లో ఆయన డిల్లీకి పయనమవుతారని సీఎం వర్గాలు చెబుతున్నాయి.
Also read:ఎంపీ మహువా మొయిత్రా మీద సస్పెన్షన్ వేటు పడుతుందా?
నిన్న ప్రమాణం చేసిన మంత్రులకు ఏఏ శాఖలు కేటాయించాలి. అలాగే మిగిన 6 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో అధిష్టానంతో చర్చించనున్నారు. ఢిల్లీ పెద్దలతో వీటి గురించి ఈ రోజు రాత్రికి ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు మిగిలిన 6 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలని అన్న దాని మీద అందరిలో ఉత్కంఠత నెలకొంది. వివేక్ వెంకటస్వామి, సుదర్శనరెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్, మల్ రెడ్డి రంగారెడ్డి, కూనంనేని ఉన్నారు. వీరిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో చూడాలి. ఇక ఢిల్లీలో చర్చల తర్వాత రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రికే హైదరాబాద్ కు చేరుకోనున్నారు.
ప్రజా దర్బార్..
ఇక మరోవైపు ఈరోజు మొదలుపెట్టిన ప్రజాదర్బార్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. మొదట దీనిని రేవంత్ రెడ్డి ప్రారంబించారు. కొంతసేపు అక్కడే ఉండి ప్రజల సమస్యలు విన్నారు. వారు అందించిన వినతి పత్రాలను స్వీకరించారు. సీఎం రేవంత్ వెళ్ళిన తరువాత ఆ బాధ్యతను మంత్రి సీతక్క తీసుకున్నారు. మిగతా ప్రజల సమస్యలను ఆమె వింటున్నారు.