Telangana : ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్.. మిగిలిన నాలుగు స్థానాల ఎంపీ అభ్యర్ధలు ప్రకటించే అవకాశం?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్రంలో మిగిలిన లోక్‌సభ అభ్యర్ధులను ఈరోజు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని కోసమే ఇవాళ డిల్లీలో సీఈసీ మీటింగ్ జరగనుందని...దానిలో పాల్గొనడానికే రేవంత్ వెళుతున్నారని తెలుస్తోంది.

New Update
Telangana : ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్.. మిగిలిన నాలుగు స్థానాల ఎంపీ అభ్యర్ధలు ప్రకటించే అవకాశం?

CM Revanth Reddy : తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్(Congress) ఇంకా నాలుగు లోక్‌సభ అభ్యర్ధుల స్థానాలను ప్రకటించాల్సింది. రాష్ట్రంలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను ఇంతకుముందే ప్రకటించింది. కానీ వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్ధులను మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇప్పుడు ఈ నాలుగు నియోజకవర్గం అభ్యర్ధులను ఇవాళ ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈరోజు ఢిల్లీ(Delhi) లో సీఈసీ(CEC) సమావేశం దీని కోసమే జరుగుతోందని...ఇందులో పాల్గొనడానికే సీఎం రేవంత్ డిల్లీ బయలుదేరారని చెబుతున్నారు. సీఎంతో పాటూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ కూడా ఉన్నారు. ఇక మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ లుకూడా సీఈసీ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం అవుతోంది.

నాలుగు స్థానాల మీద ఉత్కంఠత..

లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) ల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఆలోచిస్తోంది. దీని కోసం మంత్రులు, సీనియర్ నేతలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమిస్తోంది. అయితే ఖమ్మం,వరంగల్,కరీంనగర్‌, హైదరాబాద్ స్థానాల్లో పీటముడి ఉంది. ఖమ్మం స్థానం కోసం భట్టి, తుమ్మల, పొంగులేటి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంగనగర్‌లో కూడా సీనియర్ మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ రెండు స్థానాల మీద ఉత్కంఠత నెలకొంది. ఇక కాంగ్రెస్‌లోకి కొత్తగా చేరిన కడియంకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారని చెబుతున్నారు. అలా అయితే నాగర్ కర్నూల్ సీటు మారుస్తారని అంటున్నారు. ఈ నాలుగు సీట్ల మీద ఇంత పంచాయితీ ఉంది కనుకనే ఇప్పటి వరకు ఈ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించలేదు. అయితే ఇవాళ జరగనున్న సీఈసీ సమావేశంలో ఈ సీట్ల అభ్యర్ధులను ఎట్టి పరిస్థితులను ఖరారు చేసేస్తారని...అందుకే సీఎం కూడా వెళ్ళారని చెబుతున్నారు.

Also Read : Telangana : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..అమెరికా నుంచి హైదరాబాద్కు ప్రభాకర్ రావు

Advertisment
తాజా కథనాలు