Thailand: కరోనా లాంటి మరో వైరస్.. థాయ్‌లాండ్‌లో గుర్తించిన శాస్త్రవేత్తలు.. థాయ్‌లాండ్‌లో మరో కొత్త వైరస్ బయటపడటం కలకలం రేపుతోంది. ఈ వైరస్ వల్ల గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకోఎల్త్ అలయన్స్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ వైరస్‌కు కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. By B Aravind 14 Jan 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి Bat Virus In Thailand: ప్రపంచంలో కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకురావడం ఆందోళన రేపుంతోంది. ప్లేగు వ్యాధి, ఎబోలా, నిఫా, కరోనా లాంటి వైరస్‌లు ప్రపంచాన్ని ఎలా వణికించాయో అందిరికీ తెలిసిందే. ఇవే కాకుండా ఇంకా కొత్త వైరస్‌లు కూడా ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా థాయ్‌లాండ్ మరో వైరస్ బయటపడటం కలకలం రేపుతోంది. ఈ వైరస్ వల్ల గబ్బిలాల (Bats) నుంచి మానవులకు సోకే ప్రమాదని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకోఎల్త్ అలయన్స్ (EcoHealth Alliance) అనే పరిశోధనా సంస్థ తెలిపింది. అయితే ఈ వైరస్ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని.. 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO) సమావేశంలో డాక్టర్ పీటర్ దస్జాక్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో గతంలో పరిశోధనలు జరిపిన ఈ ఎకోహెల్త్ వివాదంలో చిక్కుకుంది. ఈ ల్యాబ్ నుంచే కరోనా కరోనా వైరస్ లీకైందని అప్పట్లో పలు అనుమానాలకు దారితీశాయి. అయితే వీటిని ఈ సంస్థ కొట్టిపారేసింది. అయితే థాయ్‌లాండ్‌లో కొత్తగా గుర్తించిన వైరస్‌కు కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం ఉందని పీటర్ దస్జాక్ అన్నారు. Also Read: అమెరికాలో మంచు తుఫాను..2000 విమానాలు రద్దు థాయ్‌లాండ్‌లోని ఓ గుహలో ఉన్న గబ్బిలాల్లో దీన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే అక్కడి స్థానిక రైతులు ఈ గుహ నుంచే గబ్బిలాల ఎరువును పంట పొలాల్లో వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఎరువులోనే ఆ వైరస్ ఉన్నట్లు చెప్పారు. మనుషులతో ఎక్కువగా కాంటక్ట్ అవుతున్న ఈ వైరస్ రాబోయే రోజుల్లో అత్యవసర పరిస్థితులను తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉందన్నారు. ఇదిలాఉండగా.. గత నెలలో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరిగాయి. డిసెంబర్ నెలలో చూసుకున్నట్లేతే దాదాపు 10 వేల మంది కరోనా బారినపడి మరణించినట్లు WHO వెల్లడించింది. కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 (COVID-19 JN.1) వ్యాప్తిచెందడం అలాగే ప్రజలు కూడా సెలవుల్లో గుమికూడటం వల్లే కేసులు పెరిగినట్లు తెలిపింది. Also Read: అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం…జనవరి 22న పబ్లిక్ హాలిడే ప్రకటించిన ఆ దేశం..!! #telugu-news #corona-virus #thailand #bats #bat-virus మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి