అమ్మో.. మరో ఎనిమిది వైరస్‌లు.. మళ్లీ మహమ్మారి ముప్పు తప్పదా..

చైనాలోని హైనాన్ అనే ప్రాంతంలో ఎనిమిది రకాల కొత్త వైరస్‌లను గుర్తించారు. పరిశోధనల్లో భాగంగా దాదాపు 700 ఎలుకల నుంచి నమూనాలు సేకరించగా.. ఈ 8 వైరస్‌లు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే ఎప్పుడైనా ఈ వైరస్‌లు ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు.

New Update
అమ్మో.. మరో ఎనిమిది వైరస్‌లు.. మళ్లీ మహమ్మారి ముప్పు తప్పదా..

మూడేళ్ల క్రితం వెలుగుచూసిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఇప్పటికీ కరోనా కేసులు ఎక్కడో ఓ చోట నమోదవుతూనే ఉన్నాయి. కాకపోతే.. మొదట్లో ఉన్నంత ప్రభావం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. అయినప్పటికీ కూడా కరోనా వైరస్ వివిధ వేరియంట్ల రూపంలో జనంపై దాడి చేస్తూనే వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో ఎనిమిది రకాల వైరస్‌లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. చైనా దక్షిణ తీరంలోని హైనాన్ అనే ప్రాంతంలో గతంలో ఎప్పుడూ కూడా చూడని.. ఎనిమిది రకాల వైరస్‌లను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకల్లో ఈ వైరస్‌లు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే ఎప్పుడైనా ఈ వైరస్‌లు ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు.

దీంతో ఈ వైరస్‌ల వల్ల మరో మహమ్మారి ముప్పు వచ్చే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే భవిష్యత్‌లో ఈ మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే పరిశోధకులు తమ ఆవిష్కరణలు కొనసాగిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా దాదాపు 700 ఎలుకల నమూనాలను సేకరించి వాటిపై పరిశోధనలు చేశారు. అయితే వీటిలో 8 కొత్త వైరస్‌లను గుర్తించారు. అయితే ఇందులో ఒకటి సార్స్‌-కోవ్‌-2, కోవిడ్‌-19కి కారణమైనటువంటి వైరస్ కుటుంబానికి చెందినట్లు గుర్తించారు. గబ్బిలాలపై పలు పరిశోధనలు చేసి ‘బ్యాట్ ఉమెన్’గా పేరు తెచ్చుకున్న శాస్త్రవేత్త డాక్టర్ షి జెంగ్లీ నూతన వైరస్‌లపై అందించిన వివరాలను వైరోలాజికా సినికా అనే జర్నర్‌లో ప్రచురించారు. అయితే ఈ వైరస్‎లు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని ఆమె తెలిపారు.

Also Read: స్త్రీలో ఆ శరీర భాగాలే కాదు..ఇతర అవయవాలు కూడా ఉన్నాయి: కంగనా ఫైర్‌!

వాస్తవానికి వైరోలాజికా సినికా అనేది ఓ చైనీస్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీకి చెందిన ప్రచురణ విభాగం. ఇది చైనా ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఎఫైర్స్‌కి చెందింది. శాస్త్రవేత్తలు 2017-2021 మధ్య కాలంలో హైనాన్ లో ఎలుకల గొంతు నుంచి శాస్త్రవేత్తలు 682 నమూనాలను సేకరించారు. అయితే ఈ నమూనాలను ఎలుకల జాతులు, అవి నివసించే ద్వీపాల ఆధారంగా వర్గీకరణ చేశారు. దీంతో ఈ పరిశోధనల్లో వాటిలోని ఈ వైరస్‌లు బయటపడ్డాయి. వీటిలో కొన్ని మనిషి ఆరోగ్యానికి ముప్పు తెచ్చే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు