Tillu Square OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన 'టిల్లు స్క్వేర్'.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా సిద్ధు మూవీ! సిద్ధు జొన్నలగడ్డ అప్ కమింగ్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ నుంచి ఓ బిగ్ అప్ డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే ఓటీటీ రైట్స్ రూ.35 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అనుపమ హీరోయిన్ గా నటించిన చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. By srinivas 21 Feb 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Tillu Square OTT Rights for Netflix: సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) అప్ కమింగ్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) నుంచి మరో బిగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మల్లిక్‌రామ్ దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మార్చి 29న థియేటర్లలో విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇటీవల ప్రేమికుల రోజున ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ప్రముఖ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్.. ఈ మేరకు థియేటర్‌లో రిలీజ్ కాకముందే ‘టిల్లు స్క్వేర్’ రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రూ.35 కోట్లకు ఈ డీల్ పూర్తయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇటీవల కాలంలో ఒక యువ కథానాయకుడి చిత్రానికి ఈ స్థాయిలో డీల్ జరగడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ‘డీజే టిల్లు’లో తన నటన, స్వాగ్‌తో యూత్ ఐకాన్ అయిపోయారు సిద్ధు జొన్నలగడ్డ. దీంతో ‘టిల్లు స్క్వేర్’ మూవీపై మంచి అంచనాలు పెరిగిపోయాయి. ట్రైలర్ ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఇది కూడా చదవండి : Singareni: సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయండి.. భట్టి విక్రమార్క ఆదేశాలు మతి పోగొట్టిన అనుపమ.. ఇక రామ్ మిర్యాల సంగీతం అందించిన ఈ చిత్రానికి తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రచార చిత్రంలో హీరో,హీరోయిన్‌ల మధ్య సంభాషణలు ‘డీజే టిల్లు’ చిత్రాన్ని గుర్తు చేశాయి. అనుపమ మునుపెన్నడూ కనిపించనంత హాట్‌గా ఇందులో దర్శనమిచ్చి యువత మతి పోగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. #netflix #anupama-parameswaran #tillu-square #siddhu-jonnalagadda #tillu-square-netflix మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి