Telangana: పరీక్షసెంటర్‌లో మారిన నీట్‌ పేపర్‌.. ఆందోళనలో విద్యార్థులు

కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన నీట్‌ పరీక్షలో పేపర్ మారడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా T3 GRIDU పేపర్ ఇవ్వగా.. ఆసిఫాబాద్‌లో N6 NANGU అనే పేపర్‌ ఇచ్చారు. ఈ పరీక్ష రాసిన 299 మంది విద్యార్థులు తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.

Telangana: పరీక్షసెంటర్‌లో మారిన నీట్‌ పేపర్‌.. ఆందోళనలో విద్యార్థులు
New Update

కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన నీట్‌ పరీక్షపై గందరగోళం నెలకొంది. సెలెక్ట్‌ చేసిన పరీక్ష పేపర్‌కు బదులుగా నిర్వాహకులు విద్యార్థులకు మరో పేపర్‌ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్‌ మోడల్ స్కూల్లో జరిగిన నీట్‌ పరీక్ష కేంద్రంలో ఈ పరీక్ష జరిగింది. 323 మంది విద్యార్థులకు గాను 299 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా జరిగిన నీట్‌ పరీక్ష పేపర్ ఒకటైతే.. కేవలం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్‌ మోడల్ స్కూల్లో మాత్రం వేరే పరీక్ష పేపర్ ఇచ్చారు. పేపర్ మారడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.

Also Read: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్!

SBI బ్యాంకు నుంచి తీసుకురావాల్సిన పేపర్‌కు బదులుగా కెనరా బ్యాంకు నుంచి తీసుకొచ్చిన పరీక్ష పేపర్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా T3 GRIDU పేపర్ ఇవ్వగా.. ఆసిఫాబాద్‌లో N6 NANGU అనే పేపర్‌ ఇచ్చారు. అయితే దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పందించి.. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లితండ్రులు కోరుతున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరిగింది. పరీక్షపై యూట్యూబ్‌లో విశ్లేషణ వీడియోలు చూడగా.. ఈ విద్యార్థులకు వచ్చిన పేపర్‌ ఆ ప్రశ్నలకు మ్యాచ్‌ కాలేదు. దీంతో పేపర్ మారిపోయిందన్న విషయం వెలుగులోకి వచ్చింది.

ఆసిఫాబాద్‌లో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు ఈరోజు (సోమవారం) జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. అయితే ఈ వ్యవహారంపై కో ఆర్టినేటర్ స్పందించారు. అధికారుల తప్పిదం జరిగిందని.. పై స్థాయి వాళ్లకు సమాచారం ఇచ్చామని తెలిపారు. మరోవైపు విద్యార్థులు తాము రాసిన పరీక్షకు ప్రయోజనం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కలెక్టర్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Also read: మంత్రి పీఎస్‌ పనిమనిషి ఇంట్లో ఈడీ దాడులు.. 30 కోట్లు స్వాధీనం!

#telugu-news #neet #komaram-bheem-asifabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe