Neeraj Chopra: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు. ఈరోజ జరిగిన పోరులో మొత్తం ఆరు ప్రయత్నాల్లో నీరజ్ రెండో ప్రయత్నంలో జవెలిన్‌ను 89.45 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. పాక్ అథ్లెట్ నదీమ్ అర్షద్ 92.97 మీటర్లు జావెలిన్ విసిరి బంగారు పతకాన్ని సాధించగా...నీరజ్‌ను రజతం వరించింది. దీంతో భారత్ ఇప్పటివరకు ఐదు పతకాలు సాధించింది.
గత టక్యో ఒలిపింక్స్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా స్వర్ణాన్ని సాధించాడు. కానీ ఈసారి మాత్రం రజతంతోనే సరిపెట్టాడు. మొత్తం ఆరు ప్రయత్నాల్లో నీరజ్ ఐదు ఫౌల్స్ చేశాడు. మరోవైపు పాక్ ప్లేయర్ నదీమ్ జావలిన్ త్రోలో కొత్త ఒలింపిక్
రికార్డ్‌ను నెలకొల్పాడు. అంతకు ముందు ఆండ్రియాస్ థోర్కిల్డ్‌సెన్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో నెలకొల్పిన 90.57 ఒలింపిక్ రికార్డును అర్షద్ నదీమ్ బద్దలు కొట్టాడు. ఈ సారి ఒలింపిక్స్‌లో నదీమ్ నీరజ్ చోప్రా కంటే రెండు సార్లు మెరుగ్గా జావెలిన్‌ను విసిరాడు. ఒకటి 92.97మీ, మరొకటి 91.79మీ. ఇవి రెండు నీరజ్ కంటే మెరుగ్గా ఉండంతో నదీమ్‌కు స్వర్ణం ప్రకటించారు. ఇక మూడవస్థానంలో గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 88.54 మీటర్లతో కాంస్యం సాధించారు.
అయితే ఈసారి స్వర్ణం రాకపోయినా జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా కొత్త రికార్డ్‌ను నెలకొల్పాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణం, రజత పతకాలు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు.
Also Read:International: అంతరిక్షం నుంచి వారు ఎప్పుడు బయటకు వస్తారో..