Hospital: వైద్యుల నిర్లక్ష్యం.. 450 మంది రోగులకు HIV, హెపటైటిస్ ముప్పు.. అమెరికాలోని సాలెం అనే ఆసుపత్రిలో జూన్ 2021 నుంచి ఏప్రిల్ 2023 వరకు ఎండోస్కోపీ చేయించున్న వారికి హెచ్‌ఐవీ, హెపటైటిస్ బారిన పడే ప్రమాదం రావడం కలకలం రేపింది. తమ వద్దకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని అయితే వీటి సంక్రమణ ముప్పు తక్కువేనని వైద్యులు తెలిపారు. By B Aravind 17 Nov 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రాణాలు కాపాడేవారే వైద్యులు.. కానీ అదే వైద్యులు మనిషి ప్రాణాలను ప్రమాదంలోకి పెడితే ఎలా ఉంటుంది. అలాంటి ఘటనే అమెరికాలోని ఓ ఆసుపత్రిలో జరిగింది. కొంతకాలంగా అక్కడ ఎండోస్కోపీ చేయించున్న వారికి హెచ్‌ఐవీ, హెపటైటిస్ బారిన పడే ప్రమాదం రావడం కలకలం రేపింది. అయితే ఈ ప్రక్రియలో శరీరం లోపలికి పంపించే ట్యూబుతో కూడిన ఓ పరికరమే ఇందుకు కారణమైనట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమెరికా మాసాచుసెట్స్‌లోని సాలెం అనే ఆసుపత్రి ఉంది. అయితే ఈ ఆసుపత్రికి రోజూ రోగులు వస్తూనే ఉంటారు. అయితే ఇటీవల హస్పిటల్ యాజమన్యం తమ వద్దకు వచ్చే రోగులకు నిర్వహిస్తోన్న వైద్య పరీక్షలకు సంబంధించి కీలక విషయాన్ని గుర్తించింది. తాము నిర్వహించే ఎండోస్కోపీ విధానంలో నిర్వహణ లోపం వల్ల కొంతమంది రోగులు ప్రాణాంతక వ్యాధులకు గుర్యయ్యే అవకాశం ఉందని నిర్దారించింది. మరీ ముఖ్యంగా జూన్ 2021 నుంచి ఏప్రిల్ 2023 వరకు రెండేళ్ల కాలంలో ఎండోస్కోపీ చేసుకున్న 450 రోగులు హెచ్‌ఐవీ, లేదా హెపటైటిస్ బీ, సీ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఉన్నత ప్రమాణాలకు తగ్గట్లు తమ ఆసుపత్రి వైద్య సేవలు అందించకపోవడం వల్లే ఇది జరిగిందని పేర్కొంది. అయితే ఈ విషయాన్ని తమ వద్దకు వచ్చే రోగులకు చెప్పినట్లు ఆ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. తమ వైద్య సేవల వల్ల ప్రభావితమైనవారికి క్షమాపణలు తెలియజేస్తున్నామని పేర్కొన్నాయి. అయితే ఈ సంక్రమణ ముప్పు చాలా తక్కువగానే ఉంటుందని.. ఈ విషయానికి సంబంధించి సంబంధిత రోగులకు ఈమెయిల్, ఫోన్ ద్వారా కూడా చెప్పామని పేర్కొంది. Also Read:ఉత్తరం అయిపోయింది…దక్షిణ మీద పడ్డ ఇజ్రాయెల్ అయితే అప్పటినుంచి వారికి హెచ్‌ఐవీ, హెపటైటిస్ బీ, సీ పరీక్షలు క్రమంగా నిర్వహిస్తున్నామని.. ఇప్పటివరకు ఎవరూ కూడా ఆ ఇన్‌ఫెక్షన్ల బారిన పడినట్లు తేలలేదని తెలిపాయి. రోగులకు అవసరమైన సాయం, వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై మసాచుసెట్స్ ప్రజారోగ్య విభాగం స్పందించింది. ఈ వ్యాధుల బారినపడే ముప్పు చాలా తక్కువేనని.. దీనిపై ప్రస్తుతం విచారణ చేస్తున్నామని స్పష్టం చేసింది. #hiv #telugu-news #hospital #america-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి