Nigeria: కిడ్నాపైన 300 మంది పిల్లలు విడుదల.. ఎక్కడంటే

ఆఫ్రికాలోని నైజీరియాలో ఇటీవల 300 మంది విద్యార్థులు కిడ్నాప్‌ కాగా.. తాజాగా వారిని దుండగులు విడుదల చేశారు. భద్రతా ఏజెన్సీల సమన్వయం, వ్యూహరచనలతో ఇది సాధ్యమైందని అక్కడి స్థానిక గవర్నర్ పేర్కొన్నారు.

Nigeria: కిడ్నాపైన 300 మంది పిల్లలు విడుదల.. ఎక్కడంటే
New Update

Nigeria: ఇటీవల ఆఫ్రికాలోని నైజీరియాలో దాదాపు 300 మంది విద్యార్థులు కిడ్నాప్‌ కావడం సంచలనం రేపింది. దాదాపు రెండు వారాలా తర్వాత ఈ వ్యవహారం సుఖాంతమైంది. విద్యార్థులను అపహరించిన కిడ్నాపర్లు వారిని సురక్షితంగా విడిచిపెట్టారని అధికారులు తెలిపారు. భద్రతా ఏజెన్సీల సమన్వయం, వ్యూహరచనలతో ఇది సాధ్యమైందని అక్కడి స్థానిక గవర్నర్ పేర్కొన్నారు. అలాగే కిడ్నాపైన పిల్లను సురక్షితంగా వెనక్కితీసుకొచ్చేందుకు నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు చొరవ చూపినట్లు తెలిపారు.

Also Read: జగన్‌ను దెబ్బకొట్టేలా చంద్రబాబు పర్యటనలు

రూ.5 కోట్లు ఇవ్వాలి 

ఇక వివరాల్లోకి వెళ్తే.. మార్చి 7వ తేదీన కడునా రాష్ట్రంలోని కురిగా అనే పట్టణంలో ఓ పాఠశాలకు అకస్మాత్తుగా సాయుధులు వచ్చారు. ఆ తర్వాత 300 పిల్లల్ని కిడ్నాప్‌ చేసి వారి వెంట తీసుకెళ్లారు. దుండగులను అడ్డుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కాల్చి చంపేశారు. అయితే ఆ సాయుధులు.. విద్యార్థులను తమతో పాటు సమీపంలో ఉన్న అడవులకు తీసుకుపోయారు. చిన్నారుల్లో 12 ఏళ్ల లోపు ఉన్నవారే దాదాపు 100 మంది వరకు ఉన్నారు. వాళ్లని విడుదల చేసేందుకు రూ.5 కోట్లు ఇవ్వాలని లేకపోతే పిల్లల్ని చంపేస్తామని బెదిరించారు.

ఇప్పటివరకు 1400 మంది కిడ్నాప్ 

మరోవిషయం ఏంటంటే నైజీరియాలో పిల్లల అపహరణ ఉదంతాలు గతంలో కూడా జరిగాయి. అయితే ఇంత భారీ సంఖ్యలో అరెస్టు కావడం కలకలం రేపింది. ఒక్కపైసా కూడా ఇవ్వకుండా దుండగులకు చెల్లించకుండా విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నిస్తామని ఆ దేశ అధ్యక్షుడు టినుబు తెలిపారు. ఈ క్రమంలోనే విద్యార్థులందరూ విడుదల కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే నైజీరియా ప్రభుత్వం కిడ్నాపర్లకు డబ్బులు పంపారా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. 2014 నుంచి ఇప్పటివరకు 1,400 మంది విద్యార్థులు కిడ్నాప్ అయ్యారు.

Also Read: ఆ యాప్‌ నుంచే మాస్కో దాడికి కుట్ర

#kidnap #nigeria #telugu-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe