Rajastan: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 20 మందిపై సామూహిక అత్యాచారం

అంగన్‌వాడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 20 మందిపై మహిళలపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లో ఈ ఘటన జరిగింది. వాళ్ల అఘాయిత్యాన్ని ఎదిరించిన ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Rajastan: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 20 మందిపై సామూహిక అత్యాచారం
New Update

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 20 మందిపై మహిళలపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. సిరోలికి చెందిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్‌ మహేంద్ర చౌదరి అంగన్‌వాడిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కొందరు మహిళలను నమ్మించి తమ బుట్టలో వేసుకున్నారు.

Also Read: బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయే చెప్పిన ప్రధాని..

20 మందిపై సామూహిక అత్యాచారం 

వాళ్లకి ఆశ్రయమిచ్చి అన్ని సౌకర్యాలు కల్పించారు. మత్తు మందు కలిపిన ఆహారం అందించారు. ఆ తర్వాత 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరించి ఈ విషయం ఎవరికీ చెప్పకూడదంటూ బెదిరించేవారని బాధితులు వాపోయారు. అంతేకాదు వాళ్ల నుంచి లక్షల రూపాయలు డిమాండ్ చేశారని అన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన అఘాయిత్యాన్ని ఎదిరించిన ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మాకు న్యాయం చేయండి 

దీంతో ఆమెతో పాటు మరికొందరు మహిళలు కూడా వచ్చారు. కానీ నిందితులపై ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేయకుండా.. తాము చేస్తున్నవి కేవలం ఆరోపణలేనని పోలీసులు కొట్టిపారేసినట్లు బాధితులు చెబుతున్నారు. చివరకి తమకు న్యాయం చేయాలని రాజస్థాన్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు. చివరికి ఆ ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. చివరికి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: కేసీఆర్‌పై రేవంత్ బిగ్ స్కెచ్.. రేపే ముహూర్తం

#telugu-news #national-news #rajastan #anganwadi-jobs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe