/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-05T174727.580.jpg)
NDA Meeting: ప్రధాని మోదీ నివాసంలో NDA సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు ఈ భేటీ కొనసాగింది. సమావేశంలో మొదటగా ప్రధాని మోదీ ప్రసంగిచంగా ఆ తర్వాత టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రసంగించారు. ఎన్డీయేకు పూర్తిస్థాయి మద్దతిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కాసేపట్లో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్.. అలాగే చంద్రబాబు, నితీష్ కుమార్, ఇతర కూటమి నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు.
ఎన్డీయే కూటమిలో బీజేపీతో పాటు 15 పార్టీలు ఉన్నాయి. అయితే కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవుల కోసం.. మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలక పదవులను తెలుగుదేశం, జేడీయూ పార్టీలు ఆశీస్తున్నట్లు తెలుస్తోంది. రైల్వేశాఖ, షిప్పింగ్, ఐటీ, విమానయాన, ఉపరితల రవాణాశాఖ, మానవ వనరుల శాఖలపై మిత్రపక్షాల పట్టుపట్టినట్లు సమాచారం.
Also Read: హీరో టూ జీరో.. ప్రధాని రేసు నుంచి పతనానికి కేసీఆర్!