NDA Lost In Majority Of Seats : ఎన్నికల్లో (Elections) ఎన్డీయే (NDA) మెజారిటీ సాధించింది కానీ నార్త్‌లో చాలా ముఖ్య రాష్ట్రాల్లో తమ పత్తా చాటులేకపోయింది. కొన్ని రాష్ట్రాల్లో ఓడిపోగా మరికొన్నింటిలో ఏదో పరువు నిలబెట్టుకుంది. ఎన్డీయే ఘోరంగా ఓడిపోయిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. 23 స్థానాలకు గానూ కేవలం తొమ్మది మాత్రమే గెలుచుకుంది. అన్నింటి కంటే ఘోరమైన విషయం ఏంటంఏ... మోదీ ప్రచారం చేసిన 18 నియోజకవర్గాల్లో కేవలం మూడింటిలో మాత్రమే బీజేపీ నేతలు గెలిచారు.
మహారాష్ట్రల్లో ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ తెగ తిరిగేశారు. మొత్తం 18 స్థానాల్లో ఆయన రోడ్ షోలు, సభలు నిర్వహించారు. ఇందులో 15 స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది.
ముంబై, పూనే..
ఇక్కడ ఆరు లోక్‌సభ స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) బహిరంగ సభలు నిర్వహించారు. కానీ ఇందులో రెండిలో మాత్రమే ఎన్డీయే విజయం సాధించింది. ముంబై నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థి పీయూష్ గోయల్ గెలుపొందగా, ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి రవీంద్ర వైకర్ విజయం సాధించారు. అలాగే పూనెలో కూడా మోదీ చరిష్మా పని చేసింది. అక్కడ బీజేపీ అభ్యర్ధి మురళీధర్ మోహోల్ కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర ధంగేకర్‌పై మోహోల్ లక్ష ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ మూడు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ఓటమిపాలయ్యింది.
బీజేపీ ఓటమి స్థానాలు..
ముంబై ఈశాన్య నియోజకవర్గంలో బీజేపీ (BJP) అభ్యర్థి మిహిర్ కొటేచా 29,861 ఓట్ల తేడాతో శివసేన అభ్యర్థి సంజయ్ దిన పాటిల్ చేతిలో ఓడిపోయారు.
నాసిక్ ..
శివసేన అభ్యర్థి హేమంత్ గాడ్సే తరపున ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించారు. కానీ ఇక్కడ శివసేన యుబిటి అభ్యర్థి రాజాభౌ వాజే చేతిలో లక్షకు పైగా ఓట్ల తేడాతో గాడ్సే ఓడిపోయారు.
నాందేడ్..
ఇక్కడ సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి ప్రతాప్ గోవిందరావు చిఖాలీకర్ పాటిల్. ఈయన కోసం మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు అయితే ఇక్కడ కూడా మోదీ మ్యాజిక్ పనిచేయకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి వసంతరావు బల్వంతరావు చవాన్ చేతిలో ఓడిపోయారు.
చంద్రాపూర్..
చంద్రపూర్‌లో బిజెపి అభ్యర్థి, మంత్రి సుధీర్ ముంగంటివార్ కోసం ప్రధాని మోడీ బహిరంగ సభ నిర్వహించారు. కానీ ఈయన కూడా ఓడిపోయారు.అది కూడా రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో. ఇక్కడ నుంచి కాంగ్రెస్‌కు చెందిన ప్రతిభా ధనోర్కర్ ఎన్నికయ్యారు.
రామ్‌టెక్..
శివసేన షిండే పార్టీకి చెందిన రాజు దేవ్‌నాథ్ పర్వేకు అనుకూలంగా రామ్‌టెక్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఇక్కడ కూడా కాంగ్రెస్సే గెలిచింది.
వార్ధా..
బీజేపీ అభ్యర్థి రాందాస్ తదాస్‌కు ఓటు వేయాలని కోరుతూ ప్రధాని మోదీ కూడా వార్ధాలో రోడ్‌షో నిర్వహించారు. కానీ ఫలితాల తర్వాత ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి అమర్ కాలే చేతిలో తడస్ ఓడిపోయారు.
Also Read:Chandra Babu: జూనియర్ ఎన్టీయార్ ట్వీట్‌కు చంద్రబాబు వైరల్ రిప్లై