National: 10 లక్షల ఉద్యోగాలే ప్రధానాంశంగా కాంగ్రెస్ మేనిఫెస్టో..రాహుల్ హామీ

లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పది లక్షల ఉద్యోగాల భర్తీ విషయాన్ని మేనిఫెస్టోలో పెడుతామన్నారు. భారత్ జోడో యాత్రలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.

New Update
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ!

Rahul Gandhi on Congress Manifesto: కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) 51వ రోజుకు చేరుకుంది. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న రాహుల్ తిరిగి మధ్యప్రదేశ్‌లోని శివపురి నుంచి న్యాయ్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగాన్ని ఎత్తిచూపిన రాహుల్ గాంధీ..ఉద్యోగాల విషయంలో బీజేపీని (BJP) దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం పోస్టుల భర్తీకి తలుపులు మూసేసిందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. కొలువుల తలుపులు తెరుస్తామన్నారు. మొత్తం 10 లక్షల ఉద్యోగాలు (10 Lakh Jobs) భర్తీ చేస్తామన్నారు. ఈ ఉద్యోగాలను గత పదేళ్లుగా ... నరేంద్ర మోదీ సర్కారు భర్తీ చేయకుండా ఉంచిందన్నారు. కేంద్రంలోని 15 విభాగాలలో దాదాపు 30% పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని (Narendra Modi) ప్రశ్నించారు. పది లక్షల ఉద్యోగాల భర్తీ విషయాన్ని మేనిఫెస్టోలో పెడుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ పోస్టులను కొత్త వారితో భర్తీ చేయకుండా సమయాన్ని సాగదీస్తున్నదని ఆరోపించారు.

30 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి..

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 78 విభాగాలలో తొమ్మిది లక్షల 64 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. కేంద్రంలోని 15 విభాగాల్లో దాదాపు 30% పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్కలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రైల్వేల్లో 2.93 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని..అలాగే హోం శాఖలో 1,43,000 పోస్టులు, రక్షణ శాఖ సంబంధిత విభాగాలలో దాదాపు రెండు లక్షల 64 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాహుల్‌ తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయంలోనే చాలా ముఖ్యమైన పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా పడి ఉన్నాయని ఆరోపించారు రాహుల్. ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఉండేందుకు బీజేపీ ఇంజనీర్లు పీపర్ లీక్ నాటకం ఆడిస్తున్నారని మండిపడ్డారు.  మోదీ గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తన శాఖలో ఉన్న పోస్టులనే భర్తీ చేయలేని మోదీ గ్యారెంటీల పేరుతో ప్రజలను, దేశ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గందరగోళంలో యువత..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖాళీగా పడి ఉన్న పోస్టుల్లో భర్తీలను నిలిపివేసి, వాటి స్థానంలో తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతిలో భర్తీలు చేపట్టి, దేశ యువతను అస్థిరతకు గురి చేస్తోందని రాహుల్ విమర్శించారు. యువతకు ఉద్యోగ భద్రత , ఆత్మ గౌరవం కలిగించకుండా గందరగోళం సృష్టిస్తోందని అన్నారు. ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే ఈ అస్థిరతను పోగొడతామని హామీ ఇచ్చారు. దీనిని తమ మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తామని చెప్పారు. 10 లక్షల ఉద్యోగాలే మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు.

Also Read:SSMB29: మహేష్ బాబు కోసం 8 లుక్స్..రాజమౌళి కసరత్తులు

Advertisment
Advertisment
తాజా కథనాలు