Paris: పారాలింపిక్స్‌లో ఈరోజు అదృష్టం బంగారం రూపంలో కలిసి వచ్చింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-41లో నవదీప్ స్వర్ణం దక్కించుకున్నాడు. అయితే మొదట ఈ పోటీలో ఇరాన్ అథ్లెట్ కు బంగారు పతకాన్ని అనౌన్స్ చేశారు. పాయింట్ల పట్టీలో అతనే ముందున్నాడు. నవదీప్ రెండో స్థానంలో ఉండడంతో అతనికి రజతం వచ్చింది. అయితే అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు పడింది దీంతో నవద్ మొదటి స్థానానికి చేరుకున్నాడు. స్వర్ణ పతకం నవదీప్ సొంతమైంది. దీంతో జావెలిన్ త్రో ఎఫ్-41లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా నవదీప్ అరుదైన ఘనత సాధించాడు. అంతకు ముందు మహిళల రన్నింగ్ రేస్‌లో వచ్చిన కాంస్యంతో కలిపి భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది.
Also Read: USA: వ్యోమగాములు లేకుండానే భూమి మీదకు స్టార్ లైనర్ స్పేస్ షిప్