Paralympics 2024: భారత్ ఖాతాలోకి మరో స్వర్ణం పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలోకి మరో స్వర్ణం వచ్చి చేరింది. అది కూడా అనూహ్యంగా జరిగింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్–41లో నవదీప్ బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. అంతకు ముందు 200 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రన్ కాంస్య పతకం సాధించింది. By Manogna alamuru 08 Sep 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Paris: పారాలింపిక్స్‌లో ఈరోజు అదృష్టం బంగారం రూపంలో కలిసి వచ్చింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-41లో నవదీప్ స్వర్ణం దక్కించుకున్నాడు. అయితే మొదట ఈ పోటీలో ఇరాన్ అథ్లెట్ కు బంగారు పతకాన్ని అనౌన్స్ చేశారు. పాయింట్ల పట్టీలో అతనే ముందున్నాడు. నవదీప్ రెండో స్థానంలో ఉండడంతో అతనికి రజతం వచ్చింది. అయితే అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు పడింది దీంతో నవద్ మొదటి స్థానానికి చేరుకున్నాడు. స్వర్ణ పతకం నవదీప్ సొంతమైంది. దీంతో జావెలిన్ త్రో ఎఫ్-41లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా నవదీప్ అరుదైన ఘనత సాధించాడు. అంతకు ముందు మహిళల రన్నింగ్ రేస్‌లో వచ్చిన కాంస్యంతో కలిపి భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. Also Read: USA: వ్యోమగాములు లేకుండానే భూమి మీదకు స్టార్ లైనర్ స్పేస్ షిప్ #paralympics-2024 #paris #javelin-throw #gold మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి