Hi Nanna OTT Release: ఓటీటీలో హాయ్ నాన్న .. రిలీజ్ డేట్ వచ్చేసింది

శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం 'హాయ్ నాన్న'. డిసెంబర్ 7 న రిలీజైన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అందుకుంది. థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం OTT ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 4 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.

New Update
Hi Nanna OTT Release: ఓటీటీలో హాయ్ నాన్న .. రిలీజ్ డేట్ వచ్చేసింది

Hi Nanna OTT Release: 2023 డిసెంబర్ 7 న థియేటర్స్ లో విడుదలైన నేచురల్ స్టార్ నాని(Hero Nani) హయ్ నాన్న చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్ సొంతం చేసుకుంది. డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రొమాంటిక్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూళ్లు చేసింది. తాజాగా చిత్ర బృందం ఇయర్ ఎండ్ అయ్యేసరికి హాయ్ నాన్న అధికారిక కలెక్షన్స్ కూడా రిలీజ్ చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలిపారు. ఇక థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం.. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

Hi Nanna OTT Release

Also Read: Salaar Collections: క్రిస్మస్‌ రోజూ సునామీ వసూళ్లు.. రికార్డులను ఊడ్చిపడేస్తున్న ప్రభాస్‌ సలార్!

హాయ్ నాన్న ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. జనవరి 4 న నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమ్ అవ్వనున్నట్లు తెలిపారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. థియేటర్స్ లోనే కాదు ఓటీటీలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో నాని, బేబీ కియార మధ్య జరిగే కొన్ని ఎమోషనల్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. సినిమాలోని సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసిన విషయమా తెలిసిందే. డైరెక్టర్ శౌర్యువ్ మొదటి సినిమాలోనే డిఫరెంట్ కాన్సెప్ట్ అందించి.. సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నారు. అద్భుతమైన స్టోరీతో ప్రేక్షకులను మెప్పించాడు.

Also Read: Salaar Collections: బాక్సాఫీస్ వద్ద సలార్ సునామీ.. 500 కోట్లతో ప్రభాస్ ఊచకోత

Advertisment
తాజా కథనాలు