Salaar Collections: క్రిస్మస్ రోజూ సునామీ వసూళ్లు.. రికార్డులను ఊడ్చిపడేస్తున్న ప్రభాస్ సలార్! మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూలు చేసిన ప్రభాస్ 'సలార్' క్రిస్మస్ రోజూ భారీ కలెక్షన్స్ రాబట్టింది. డిసెంబర్ 25 ఒక్క రోజే 40 కోట్లు వసూలు చేసి ఈ వారాన్ని ఘనంగా ప్రారంభించింది. న్యూ ఇయర్ వచ్చేలోపే ఈ సినిమా రూ.1000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా. By Archana 26 Dec 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Salaar Collections: క్రిస్మస్ సందర్భంగా పబ్లిక్ హాలీడే కావడంతో సలార్ వసూళ్ళ వేట కొనసాగుతూనే ఉంది. ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా మంచి లాభాలను రాబడుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల మార్క్ దాటేసి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీగా ఉంది. సినిమా విడుదలైన మూడు రోజుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 208 కోట్ల వసూళ్లను రాబట్టింది . నాలుగవ రోజు కూడా తగ్గేది లేదంటూ లాభాల బాటలో దూసుకెళ్తుంది సలార్. డిసెంబర్ 25 న క్రిస్మస్ హాలిడే కావడంతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మరింత పెరిగాయి. మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూలు చేసిన ప్రభాస్ 'సలార్' క్రిస్మస్ రోజూ భారీ కలెక్షన్లను రాబట్టింది. డిసెంబర్ 25 ఒక్క రోజే రూ.40 కోట్లు వసూలు చేసి ఈ వారాన్ని ఘనంగా ప్రారంభించింది. న్యూ ఇయర్ వచ్చేలోపే ఈ సినిమా రూ.1000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా. సలార్ సినిమాలో తమిళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ స్నేహితుడిగా కీలక పాత్ర పోషించాడు. శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరిరావు, శ్రియారెడ్డి ప్రధాన పాత్రలో కనిపించారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారే కథనంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల తర్వాత సలార్ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషంలో తేలిపోతున్నారు. సినిమాలోని సాంగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్, ఎలివేషన్స్, విజువల్స్ అద్భుతంగా చూపించారు ప్రశాంత్ నీల్. ప్రభాస్ అభిమానులకు సలార్ ఒక మంచి విజువల్ ఫీస్ట్. Also Read: Salaar Collections Day 3: సలార్ కలెక్షన్ల ఊచకోత.. రూ. 400 కోట్లతో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ప్రకంపనలు! #salaar-collections #prabhas-salaar-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి