Health Insurance: గుడ్ న్యూస్.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది..
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఇది కనుక అమలు అయితే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చౌకగా మారుతుంది. సార్వత్రిక ఎన్నికల తరువాత ఈ ప్రతిపాదన అమలులోకి రావచ్చు.