Air India Express plane: విమానంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ఎయిర్ పోర్ట్
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు-కొచ్చి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు చెలరేగాయి. గమనించిన పైలట్ విమానాన్ని ఎమర్జేన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో 179 మంది ప్రయాణికులు ఉన్నారు.