/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Mumbai-In-High-Alert.jpg)
Bomb Threatening Call: దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ బాంబ్ బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో స్కూళ్లకు, ఆసుపత్రుల్లో బాంబ్ ఉందంటూ ఇమెయిల్ రావడం మరవకముందే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బాంబ్ పేలుతుందంటూ వచ్చిన ఓ బెదిరింపు కాల్ తో ముంబై పోలీసులు ముంబై సిటీని హై అలర్ట్ ప్రకటించారు. ముంబైలోని దాదర్ ప్రాంతంలో ఉన్న మెక్‌డొనాల్డ్‌లో పేలుడు జరుగుతుందని ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. మెక్‌డొనాల్డ్‌ను పేల్చివేయడం గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం విన్నప్పుడు తాను బస్సులో ప్రయాణిస్తున్నట్లు కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. కాల్ తర్వాత, పూర్తి విచారణ చేసినప్పటికీ, పోలీసులకు అనుమానాస్పద వస్తువు కనుగొనబడలేదు. పోలీసులు ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం వాస్తవమేనా? లేదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Maharashtra | Mumbai Police Control room received a threat call, in which the caller informed that there would be a blast in McDonald's located in Dadar area of Mumbai. The caller said that he was travelling in a bus when he heard two people talking about blowing up McDonald's.…
— ANI (@ANI) May 19, 2024
ఇటీవల ఢిల్లీలో..
దేశరాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఈ నెల 8న ఉదయం ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలోని వందకు పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను బయటకు పంపించాయి. సమాచారం మేరకు వెంటనే ఆయా స్కూళ్లకు పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు చేరుకున్నాయి. పాఠశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు జరపగా.. ఎలాంటి బాంబులు ఉన్నట్లు గుర్తించలేదు. ఢిల్లీలోని దాదాపు 100 పాఠశాలలు, నోయిడాలో రెండు పాఠశాలలకు ఈ బాంబు మెయిల్స్ వచ్చాయి. దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ బాంబు బెదిరింపు మెయిల్స్ బూటకమని తెలిపింది.