AP : ఏపీ రైతులకు శుభవార్త.. నేటి నుంచే ఖాతాల్లోకి డబ్బులు!
ఏపీ అన్నదాతలకు అదిరిపోయే శుభవార్త. ఏంటో తెలుసా.. మీ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో చాలా మంది రైతులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. రైతుల కోసం ఖరీఫ్ - 2023 కరవు సాయాన్ని ఏపీ ప్రభుత్వం తాజాగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది
Aam Aadmi Party: సీఎంను, పార్టీని లేకుండా చేయాలని బీజేపీ కుట్ర.. ఆప్ సంచలన ఆరోపణలు
బీజేపీ కుట్రలో భాగంగానే లిక్కర్ స్కాం కేసులో ఈడీ తమ పార్టీ పేరును ఛార్జిషీట్ లో పేర్కొందని ఆప్ ఆరోపించింది. ఆప్ పార్టీని, పార్టీకి సంబంధించిన ముఖ్యనేతలను అణిచివేయాలని బీజేపీ చూస్తుందని తెలిపింది. ఈడీ బీజేపీలో ఒక భాగమని చురకలు అంటించింది.
Attack on Kanhaiya: కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ చెంప పగల గొట్టిన యువకుడు
ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కన్హయ్య కుమార్ పై ఒక యువకుడు దాడి చేశాడు. పూలమాల వేసే నెపంతో దగ్గరకు వచ్చిన ఆ యువకుడు కన్హయ్య కుమార్ చెంప పగలగొట్టాడు. అక్కడే ఉన్న ఆప్ మహిళా కౌన్సిలర్ ఛాయా శర్మపై వారు అనుచితంగా ప్రవర్తించారు.
General Elections 2024: లోక్‌సభ నాలుగో దశ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పెరిగిన పోలింగ్ శాతం
లోక్‌సభ నాలుగో దశ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. ఈ ఎన్నికల నాలుగోదశ పోలింగ్ శాతాల వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మే 13న జరిగిన ఎన్నికల్లో 69.16 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 2019 పార్లమెంట్ ఎన్నికలలో అదే దశ కంటే 3.65 శాతం ఎక్కువ.
Jharkhand : జేఎంఎం కీలక నిర్ణయం.. పార్టీ నుంచి సీతా సొరెన్ ఆరేళ్లు బహిష్కరణ!
జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీతా సోరెన్ పై జేఎంఎం అధిష్టానం వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి సుమారు ఆరేళ్ల పాటు పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెపై ఈ వేటు పడినట్లు సమాచారం.
Fire Accident : కదులుతున్న బస్సులో మంటలు..8 మంది సజీవ దహనం..24 మందికి తీవ్ర గాయాలు!
హర్యానాలోని కుండ్లి మనేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై అర్థరాత్రి భక్తులతో నిండిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సజీవ దహనమవ్వగా, 24 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Sonia Gandhi : నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా.. రాయ్ బరేలీలో సోనియా గాంధీ ఎమోషనల్!
యూపీ రాయ్ బరేలీ ప్రచార సభలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ భావోద్వేగానికి లోనయ్యారు. రాయ్‌బరేలీ ప్రజలు తమ కుటుంబ సభ్యులని, తమ మధ్య బంధం గంగామాత అంత పవిత్రమైనదన్నారు. 'నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా. ఆదరించండి. బరేలీ వాసుల్ని రాహుల్ నిరాశపరచడు' అన్నారు.
Breaking : ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో మంటలు.. గాల్లో 175 మంది ప్రయాణికులు!
ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. సాయంత్రం 5గంలకు ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏసీ యూనిట్లో మంటలు చెలరేగడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానంలో 175 మంది ప్రయాణికులుండగా 18 మీటర్లు ఎగిరిన విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.