Shashi Tharoor: ఇద్దరి ఫొటోలు లీక్.. స్పందించిన శశిథరూర్
కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్.. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాతో కలిసి దిగిన ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. అయితే దీనిపై స్పందించిన ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ ఫోటోలు ఓ పుట్టినరోజు వేడుకలో దిగినవంటూ తెలిపారు. కొందరు కావాలనే దురుద్దేశపూర్వకంగా ఆ ఫోటోలను ఎడిట్ చేశారంటూ పేర్కొన్నారు. ఇవి నీచపు రాజకీయాలంటూ ధ్వజమెత్తారు. పార్టీకి వచ్చిన మిగతావారందరిని తొలగించి.. కేవలం వ్యక్తిగతంగా ఉన్నట్లు ఫోటోలను వక్రీకరించారంటూ క్లారిటీ ఇచ్చారు.