Gaganyaan: గగన్‌యాన్ ప్రాజెక్టులో మహిళలకు ప్రాధాన్యం: ఇస్రో ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
ఇస్రో చేపట్టనున్న గగన్‌యాన్ ప్రాజెక్టులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వారిని ఫైటర్ టెస్ట్ అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నామని.. వాళ్లు వివిధ కేటగిరీల నుంచి ఉన్నారని తెలిపారు. అయితే ఇప్పుడు మహిళా ఫైటర్ టెస్టు ఫైలట్లు అందుబాటులో లేరని.. వారు ముందుకు వచ్చినట్లైతే ఓ మార్గం సుగమం అవుతుందంటూ సోమనాథ్ తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్టులో మహిళలను భాగం చేసేందుకు రెండో ఎంపిక శాస్త్రీయ కార్యకలాపాలతో ఉంటుందని.. అయితే ఈ ఎంపికలో శాస్త్రవేత్తలే వ్యోమగాములుగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు.