Watch Video: జైల్లో నవరాత్రి ఉత్సవాలు.. దాండియా ఆడిన మహిళా ఖైదీలు..
మధ్యప్రదేశ్లోని ఇండోర్ సెంట్రల్ జైల్లో నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేడుకలో భాగంగా జైల్లో ఉన్న మహిళా ఖైదీలు దాండియా ఆడుతూ అక్కడున్నవారందరిని ఆకట్టుకున్నారు. గత ఏడాది కూడా ఇండోర్ సెంట్రల్ జైల్లో నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న జైలు అధికారులకు మహిళా ఖైదీలు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు.