Gangster : గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ ఉగ్రవాదే..భారత ప్రభుత్వం ప్రకటన
కెనడాలో ఉన్న గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లండా ఉగ్రవాదే అంటూ ప్రకటన జారీ చేసింది భారత ప్రభుత్వం. ఉపా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రహోంశాఖ తెలిపింది.
కెనడాలో ఉన్న గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లండా ఉగ్రవాదే అంటూ ప్రకటన జారీ చేసింది భారత ప్రభుత్వం. ఉపా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రహోంశాఖ తెలిపింది.
స్నేహా అనే యువతి 25 ఏళ్లకే నలుగురిని పెళ్లాడిన సంఘటన కర్ణాటకలో జరిగింది. డబ్బులున్న కుర్రాళ్లే టార్గెట్ గా పరిచయాలు పెంచుకుని వరుస పెళ్లిల్లు చేసుకుంది. ప్రెగ్నెంట్ పేరుతో పుట్టింటికి వెళ్లి ఆమె తిరిగి రాకపోవడంతో చివరి భర్త ప్రశాంత్ పోలుసులకు పట్టించాడు.
ప్రధాని మోదీ ఈరోజు అయోధ్యలో పర్యటించనున్నారు. అయోధ్యలో అంతర్జాతీయ విమానా శ్రయాన్ని, ఆధునీకరించిన రైల్వే స్టేషను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
పోలీసు వాహనాన్ని కొట్టేసిన ఓ దొంగ దాంతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టడంతో పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. ఈ సంఘటన గుజరాత్ లోని ద్వారకాలో జరిగింది.
ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ అమ్మాయితో మాట్లాడుతున్నాడనే కారణంగా మహీర్(20) అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు. ఈ కేసులో ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. యువతి విషయంలో జరిగిన ఘర్షణే ఈ హత్యకు కారణం అని తేల్చారు పోలీసులు.
రాజకీయ నేతల ఆపిల్ ఫోన్ల హ్యాక్ విషయం మీద వాషింగ్టన్ పోస్ట్ రాసిన కథనం మీద మండిపడ్డారు యూనియన్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్. సగం సగం నిజాలు తెలుసుకుని వార్తలను రాయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ట్వీట్ చేశారు.
మరికొన్ని రోజుల్లో అయోధ్య రామాలయం ప్రారంభమవబోతోంది. జనవరి22న రాములవారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. అయితే ఆ రోజు గర్బాలయంలో ప్రతిష్ఠించే విగ్రహం కోసం మూడు డిజైన్లను రూపొందించారు. వీటిలో ఒకదాన్ని ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తారు.
వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవుల జాబితాను ప్రకటించింది ఆర్బీఐ. దేశవ్యాప్తంగా అన్ని రాష్రాలకు శని ఆదివారాలతో కలిపి మొత్తం 81 సెలవు రోజులు ఉన్నాయి. వీటిలో కొన్ని రాష్ట్రాల ప్రత్యేక సెలవులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 46 సెలవు రోజులు ఉన్నాయి.
పెరిగిపోతున్న ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కంది, మినపప్పులపై దిగుమతి సుంకంపై తగ్గింపును పొడిగించారు. డీజీఎఫ్టీ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అంతేకాకుండా, పప్పుల ధరలు పెరగకుండా బఫర్ స్టాక్ ఏర్పాటు చేసుకుంటోంది ప్రభుత్వం.