New Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని గోకల్‌పురిలో ఘోరం జరిగింది. 20 ఏళ్ల యువకుడిని కొందరు అగంతకులు కత్తితో పొడిచి పొడిచి చంపేశారు. ఇందుకు కారణం.. అతను ఓ అమ్మాయితో మాట్లాడటమేనట. ఇన్‌స్టాగ్రమ్(Instagram)లో ఓ అమ్మాయితో మాట్లాడాడని యువకుడిని పొట్టన పెట్టుకున్నారు దుర్మార్గులు. ఇందుఉ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘజియాబాద్(Ghaziabad) నివాసి అయిన మహీర్ అలియాస్ ఇమ్రాన్.. సెంట్రల్ ఢిల్లీ(Central Delhi)లోని పహార్ గంజ్‌లోని ఫ్లెక్స్ బోర్డు తయారీ దుకాణంలో పని చేసేవాడు. ఈ క్రమంలోనే.. ఇన్‌స్టాగ్రమ్‌లో అతనికి ఓ అమ్మాయి పరిచయమైంది. మహీర్తో పాటు అర్మాన్ అనే వ్యక్తికి కూడా ఆ అమ్మాయి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఆ అమ్మాయితో చాట్ చేయడం, మాట్లాడటం చేసేవారు.
పూర్తిగా చదవండి..Delhi: అమ్మాయితో ఆ ఇద్దరు చాటింగ్.. కట్ చేస్తే నడిరోడ్డుపై ఘోరం..!
ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ అమ్మాయితో మాట్లాడుతున్నాడనే కారణంగా మహీర్(20) అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు. ఈ కేసులో ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. యువతి విషయంలో జరిగిన ఘర్షణే ఈ హత్యకు కారణం అని తేల్చారు పోలీసులు.
Translate this News: