/rtv/media/media_files/2025/06/01/UhCrcG4n5oK0jTiubz5W.jpg)
యూట్యూబర్ ముసుగులో జ్యోతి మల్మోత్రా పాక్ గుడాఛర్యం చేసిన విషయం తెలిసిందే. ఇన్ని రోజులు ఆమె ఇండియాలో ఉంటూ రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసింది. దీంతో జాతీయ భద్రతపై నిఘా సంస్థలు మరింత ఫోకస్ చేశాయి. ఇండియా నుంచి పాకిస్తాన్‌కు బైక్‌పై వెళ్లిన యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ను NIA అదుపులోకి తీసుకుంది. చెన్నై నుంచి అతన్ని NIA అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. పాకిస్తాన్‌కు వెళ్లినప్పుడు భయ్యా సన్నీ యాదవ్ జకీర్ నాయక్‌ను కసినట్లు తెలిసింది. బైక్ పై పాకిస్తాన్ వెళ్లిన సన్నీయాదవ్ సుమారు ఆరునెల పాటు పాకిస్తాన్ లో వివిధ ప్రాంతాలు తిరుగుతూ, వీడియోలు చేస్తూ .. సరిగ్గా పెహల్గామ్ దాడికి 12రోజులు ముందుగా పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు సమాచారం.
సరిగ్గా 7 నెలల క్రితం పాకిస్తాన్‌లో జకీర్ నాయక్ తో భయ్యా సన్నీ యాదవ్ ఓ సమావేశంలో పాల్గొన్నాడు. అక్కడ జకీర్‌తో వన్ టూ వన్ మాట్లడటం పెనుదుమారం రేపుతోంది. ఎందుకంటే ఈ జకీర్ నాయక్ ఓ ముస్లిం మత ప్రభోధకుడు. ఇతని ప్రసంగాలు మతాల మధ్య విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉండటంతో భారత్ ఇతనిని దేశ బహిష్కరణ చేసింది. ఇతని వీడియోలను నిషేధించింది. అంతేకాదు జకీర్ పై ఎన్ ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. రెడ్ కార్నర్ నోటీసులు సైతం ఇచ్చింది. కానీ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఇతర దేశాల పౌరసత్వం సాకుగా చూపి తిరుగున్నాడు. అంతలా భారత్‌లో ఆంక్షలు విధించిన జకీర్ తో గత ఏడాది అక్టోబర్ 28వ తేదిన పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సన్నీ యాదవ్ కలిశారు. జకీర్ ప్రసంగిస్తున్న సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ కావడంతో అనేక అనుమానాలు బలపడుతున్నాయి.
NIA Arrests YouTuber Bayya Sunny Yadav : Phone call of Bayya Sunny Yadav with Jyoti Malhotra leaked. pic.twitter.com/9okny5umqQ
— Alerthindu1 🚩 (@alerthindu1) May 31, 2025
జకీర్ సమావేశంలో సన్నీయాదవ్ అతన్ని ఓ ప్రశ్న అడిగాడు. ముస్లీం మత సమావేశంలో సన్నీ హిందూ ధర్మం గురించి జకీర్‌ని అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సన్నీ ప్రశ్నతో జకీర్ ఖురాన్ ప్రసిద్ది గురించి, హిందూ ధర్మంతో పోల్చుతూ అవహేళన చేసేలా మాట్లడతాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది.
జకీర్ సమావేశంలో సన్నీపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. జకీర్ సమవేశం అంటే ప్రత్యేకంగా ఓ మతానికి చెందిన అంతరంగిక సమావేశంలా ఉంటుంది. అతి కొద్దిమందిని మాత్రమే జకీర్‌తో మాట్లడేందుకు అనుమతిస్తారు. సమావేశానికి ఇతర మతస్దులను రానివ్వరు. ఈ నేపధ్యంలో సన్నీ ఎలా ఈ సమావేశంలోనికి వెళ్లగలిగాడు. నేరుగా జకీర్ ను ప్రశ్నించాడంటే ఆ ప్రశ్నల వెనుక ఎవరున్నారు..? ఒక్కడుగా అంత సహసం చేయలేడు. పలు అనుమానాలు వస్తున్నాయి. ఎన్‌ఐఏ అదుపులో సన్నీ యాదవ్ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
bayya sunny yadav youtuber | haryana youtuber | Haryana YouTuber Jyoti Malhotra | pakistan | Zakir Naik | latest-telugu-news