నందిని నెయ్యితో తిరుపతి లడ్డూ.. ఈ బ్రాండ్ ప్రత్యేకత ఇదే!

తిరుమలలో లడ్డూ కల్తీ వివాదం తర్వాత దీని తయారీ కోసం నెయ్యి సరఫరా చేసే కంపెనీని టీటీడీ మార్చింది. ఇకనుంచి ఈ లడ్డూలను కర్ణాటకకు చెందిన నందిని డెయిరీ నెయ్యితో తయారుచేయనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.

New Update
Nandini

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లడ్డూ వివాదం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టీటీడీ లడ్డూ కల్తీ అయినట్లు ల్యాబ్‌ నివేదికలో బయటపడింది. ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూకు నెయ్యి సరఫరా సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్‌ డెయిరీపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఈ సంస్థపై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ వివాదం తర్వాత ఇప్పుడు లడ్డూ తయారీ కోసం నెయ్యి సరఫరా చేసే కంపెనీని టీటీడీ మార్చింది. ఇకనుంచి ఈ లడ్డూలను కర్ణాటకకు చెందిన నందిని డెయిరీ నెయ్యితో తయారుచేయనున్నారు. ఇప్పుడు నందిని డెయిరీ గురించి తెలుసుకుందాం. 

నందిని డెయిరీ ఎక్కడిది ?

నార్త్ ఇండియాలో డెయిరీ విషయానికొస్తే.. మదర్ డైరీ, అమూల్ అనే రెండు పెద్ద కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ఇక సౌత్ ఇండియాలో చూసుకుంటే నందిని డెయిరీ పేరు వినిపిస్తుంది. కర్ణాటకకు చెందిన ఈ డెయిరీ బ్రాండ్‌ను.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఈ సంస్థ.. కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యుసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్‌కు చెందింది. దీన్ని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అని కూడా పిలుస్తారు. గుజరాత్‌కు చెందిన అమూల్‌ బ్రాండ్ తర్వాత దేశంలో అతిపెద్ద డెయిరీ బ్రాండ్ ఇదే.

Also Read: సీపీఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్‌కు కీలక బాధ్యతలు..

KDCC నుంచి KMFగా

కర్ణాటకలో కొడుగు జిల్లాలో 1955లో మొదటి డెయిరీ కో ఆపరేటివ్‌ ప్రారంభించారు. అప్పట్లో ప్యాక్‌డ్ మిల్క్‌కు అంతగా ప్రాధాన్యం లేదు. రైతులే స్వయంగా ఇంటింటికీ పాలు పంపిణీ చేసేవారు. ఇక 1970లో శ్వేత విప్లవం ప్రారంభమైంది. ప్రపంచ బ్యాంకు కూడా డెయిరీ ప్రాజెక్టులకు సంబంధించి అనేక స్కీమ్‌లు తీసుకొచ్చింది. 1974లో కర్ణాటక సర్కార్.. ప్రపంచ బ్యాంక్ డెయిరీ ప్రాజెక్టును అమలు చేసేందుకు కర్ణాటక డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (KDCC)ని ఏర్పాటు చేసింది. పదేళ్ల తర్వాత అంటే 1984లో డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ పేరును కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌గా (KMF) మార్చారు . ఆ సమయంలో 'నందిని' బ్రాండ్ పేరుతో ప్యాకేజ్డ్ మిల్క్, ఇతర ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేశారు. కాలక్రమేణా నందినీ బ్రాండ్‌ కర్ణాటకలో ప్రజాదరణ పొంది ఇతర రాష్ట్రాల్లోకి కూడా విస్తరించింది. 

Also Read: కొత్త పార్టీకి నేను నాయకుడ్ని కాదు.. ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన

కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) రాష్ట్రంలోని 15 డెయిరీ యూనియన్‌లకు నాయకత్వం వహిస్తుంది. వీటిలో బెంగళూరు కోఆపరేటివ్ మిల్క్ యూనియన్, కోలార్ కోఆపరేటివ్ మిల్క్ యూనియన్, మైసూర్ కోఆపరేటివ్ మిల్క్ యూనియన్ కూడా ఉన్నాయి. ఈ పాల సంఘాలు.. జిల్లా స్థాయి డెయిరీ కోఆపరేటివ్ సొసైటీల (DCS) ద్వారా ప్రతి గ్రామం నుండి పాలను కొనుగోలు చేసి, KMFకి పంపిణీ చేస్తాయి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, డెయిరీ కోఆపరేటివ్ సొసైటీ 24,000 గ్రామాలలో నివసిస్తున్న 26 లక్షల మంది రైతుల నుంచి ప్రతిరోజూ 86 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేస్తోంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 'నందిని'  బ్రాండ్‌తో పాలు, పెరుగు, వెన్న, కాటేజ్ చీజ్, పనీర్, ఫ్లేవర్డ్ మిల్క్, చాక్లెట్‌లు, రస్క్‌లు, కుకీలు, బ్రెడ్‌లు, నామ్‌కీన్స్, ఐస్‌క్రీమ్‌లు వంటి 148కి పైగా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. 2022-23లో ఈ సంస్థ మొత్తం టర్నోవర్‌ రూ.19,784 కోట్లు. ప్రస్తుతం కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి MK జగదీష్.. KMF మేనేజింగ్ డైరెక్టర్, CEO బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు