/rtv/media/media_files/2025/06/13/3iFKI81MxYMRjCPv05Ar.jpg)
Black box
Air India Plane Crash : విమాన ప్రమాదాలు జరిగిన ప్రతిసారి మనకు తరుచుగా వినవచ్చే మాట బ్లాక్ బాక్స్. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి బ్లాక్‌బాక్స్ కీలకమని భావిస్తారు. విమానంలో అగ్నిప్రమాదం జరిగితే అందులోని పరిస్థితులను తెలుసుకోవడానికి కాక్ పిట్‌కమ్యూనికేషన్ విశ్లేషణ అత్యంత కీలకం. విమానానికి జరిగిన ప్రమాదాన్ని అంచనా వేయడానికి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్ల(ఎఫ్‌డీఆర్)లను పరిశోధకులు సేకరిస్తారు. వీటినే బ్లాక్‌బాక్స్ అని అంటారు.
ఈ బ్లాక్ బాక్స్ ద్వారా ప్రమాదం జరిగిన సమయంలో పైలట్ తీసుకునే నిర్ణయాలు, సిస్టమ్ వైఫల్యాలు, అత్యవసర ప్రతిస్పందనలను తెలుసుకుంటారు. వాటిని విశ్లేషించడం ద్వారా విమానయాన నిపుణులు భవిష్యత్తులో భద్రతా లోపాలను సవరించుకుని ప్రోటోకాల్స్‌ను మెరుగుపరిచేందుకు వీలవుతుందని విమానంలో వీటిని ఏర్పాటు చేస్తారు. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘటనలోనూ బ్లాక్‌బాక్స్‌లోని వివరాలు కీలకంగా మారనున్నాయి.ఈ రోజు ఉదయం బ్లాక్ బాక్స్ దొరింది. అధికారులు దాన్ని విశ్లేషించాల్సి ఉంది. అయితే ఎన్ని డిగ్రీల ఉష్ఫోగ్రత ఉన్నప్పటికీ ఈ బ్లాక్ బాక్స్ కాలిపోయే ప్రమాదం ఉండదు. అందువల్ల దాన్ని నుంచి ప్రమాద వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
కాగా బ్లాక్ బాక్స్ ను విశ్లేషించడానికి ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి బ్లాక్‌బాక్స్‌ను ముందుగా రికవరీ చేస్తారు. నిజానికి ఈ సీవీఆర్, ఎఫ్‌డీఆర్ పరికరాలు తీవ్రమైన మంటలతోపాటు ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా తయారు చేస్తారు. కనుక వాటికి ప్రమాదం వాటిల్లదు. ఫోరెన్సిక్ బృందాలు తమ దర్యాప్తును ప్రారంభించడానికి కీలకమైన ఆడియో, ఫ్లైట్ డేటాను దీని నుంచి సేకరిస్తాయి. కాక్ పిట్ ఆడియోను ట్రాన్స్‌స్క్రైబ్ చేయడం ద్వారా ప్రమాదం జరిగే ముందు వరకు విమానంలో ఉన్న కమ్యునికేషన్‌ను విశ్లేషిస్తారు. ప్రమాదాలకు కారణమైన కీలక అంశాలను గుర్తించడానికి నిపుణులు పైలట్ సంభాషణలు, రేడియో ట్రాన్స్‌లేషన్‌లు, అలారం, ప్రమాదం జరిగే సమయంలో వెలువడిన శబ్దాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. తద్వారా ప్రమాదానికి కారణాలను ఈ ప్రక్రియ ద్వారా వెల్లడిస్తారు.
ఫ్లైట్ డేటాతో కూడిన ఆడియో సింక్రనైజింగ్ ఎఫ్‌డీఆర్ రిపోర్ట్‌లో విమానం ఎత్తు, ఎయిర్ స్పీడ్, ఇంజిన్ పనితీరు, కంట్రోల్ ఇన్‌పుట్స్ వంటి పారామీటర్‌లు ఉంటాయి. నిబంధనల ప్రకారమే పైలట్ చర్యలు తీసుకున్నారా లేదా అనే వివరాలు ఇందులో ఉంటాయి. ప్రమాద పరిస్థితి ఎంత వేగంగా పెరిగిందో అంచనా వేయడానికి ఈ సింక్రనైజేషన్ తోడ్పడుతుంది. హెచ్చరిక సంకేతాలను గుర్తించడంలో సిబ్బంది ఎలా ప్రతిస్పందించారో అర్థం చేసుకోవడానికి ఈ బ్లాక్‌బాక్స్ ఉపయోగపడుతుంది. ఫైర్ ఇంజిన్ అలారంలు, అత్యవసర వ్యవస్థ యాక్టివేషన్‌తో సహా అగ్ని సంబంధిత ప్రమాదాల గురించి తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ కీలకం కానుంది.