Movies: సెన్సార్ ఓకే..ఇక తగ్గేదే ల్యా..పుష్ప–2 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప–2 విడుదలకు సిద్ధమైంది. తాజాగా దీని సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా నిడివి 3: 18గంటలు ఉందని చెబుతున్నారు. By Manogna alamuru 27 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ మరో సారి రాక్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ ఓ ట్రెండ్‌ను సెట్ చేశాయి. పుష్ప అయితే వేరే లెవల్. తగ్గేదే ల్యా అంటూ నేషనల్ వైడ్ హిట్ కొట్టింది. అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ ను కూడా తీసుకువచ్చింది. ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరూ పుష్ప–2తో థయేటర్లను దద్ధరిల్లించడానికి వచ్చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌తో హిట్ కొట్టేశారు. మరికొన్ని రోజుల్లో థియేటర్లలో రచ్చ చేయబోతున్న ఈ సినిమా ఈరోజు సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా నిడివి 3: 18గంటలు ఉన్నట్లు తెలుస్తోంది. చూశాక అది అస్సలు గుర్తుండదు.. మరోవైపు నిర్మాత నవీన్ యెర్నేని సైతం ‘పుష్ప 2’ రన్‌టైమ్‌పై ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. నిడివి ఎంత ఉన్నా ఇబ్బందేం లేదని, సినిమా చూశాక అసలు దాని గురించే మాట్లాడుకోరని అన్నారు. ఇక పుష్ప–2 విడుదలకు ముందే రికార్డులను సృష్టిస్తోంది. ఓవర్సీస్‌లో సూపర్ ఫాస్ట్‌గా 50 వేలకు పైగా టికెట్లు అమ్మడుబోయాయి. అలాగే ఈ సినిమా ట్రైలర్ 150 మిలియన్‌కి పైగా వ్యూస్, 3 మిలియన్‌కి పైగా లైక్స్ సాధించింది. ఇక పాట్నాలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను, తమ అభిమాన నటుడిని ప్రత్యక్షంగా చూసేందుకు రెండున్నర లక్షకుపైగా అభిమానులు వెళ్ళారు. Also Read: TS: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం- కేటీఆర్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి