/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/corona-jpg.webp)
దేశంలో మళ్ళీ కరోనా కేసులు ఎక్కువ అయ్యాయి. ఇప్పటి వరకు 250రకు పైగానే కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు కేసులు కనిపించాయి. దానికి తోడు సెలబ్రిటీలు కూడా తమకు కరోనా సోకినట్లు పోస్ట్ లు పెడుతున్నారు. దీనిపై కేంద్రం, రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. చాలాచోట్ల కరోనా టైమ్ లో పాటించాల్సి పద్ధతులను అమలు చేస్తున్నారు.
అలెర్ట్ గానే ఉన్నాం..
నమోదవుతున్న కరోనా కేసులపై కేంద్ర వైద్యశాఖ స్పందించింది. దీనిపై తాము అప్రమత్తంగానే ఉన్నామని తెలిపింది. కరోనా కేసుల నమోదుపై సమీక్ష చేస్తున్నట్లు తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తిపై సమీక్షిస్తున్నామని చెప్పింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకిన వారు ఇంటి దగ్గరే ఉండి చికిత్స తీసుకుంటున్నారు అని కేంద్ర వైద్యశాఖ ప్రకటించింది.
today-latest-news-in-telugu | corona | cases | central-health-ministry